భూశుద్ధిః మొట్టమొదట ఈ క్రింద తెల్పబడిన శ్లోకము చదివి, పూజాపీఠము ముందు కొంచెము నీళ్ళు చిలకరించవలయును.
శ్రీ ఉత్తిష్ఠను భూతపిశాచాః ఏతేభూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
లక్ష్మీదేవికి నమస్కరించి ఎడమచేతితో ఉద్దరిణితో నీరు తీసుకుని ఈ క్రింద తెలిపిన శ్లోకము చదవాలి.
ఆ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా | యస్మరేత్ పుండరీకాక్షం! సభాహ్యాభ్యాంతరశ్శుచిః ||
అని తలచి ఉద్దరిణిలో గల నీటిని శిరస్సుపై మూడుసార్లు జల్లుకుని మనస్సులో 'పుండరీకాక్ష' అని మూడుసార్లు అనుకోవాలి. ఆ తర్వాత బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవి ఫోటోకు ప్రతిమకు నైఋతిలో దీపారాధన చేయాలి. తర్వాత కేశవనామాలతో ఆచమనము చేయాలి.