• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Koneti Rayani Kathalu

Koneti Rayani Kathalu By Acharya Peta Srinivasulu Reddy

₹ 200

రాయల చెరువు

చుట్టూ కొండలు... మధ్యలో గలగలమని పారే సెలయేరు... ఉత్తరం వైపున్న తిరుమల కొండను దర్శించుకొని, శ్రీవారి పాదాలచెంతనున్న స్వర్ణముఖి నదిలో కలిసి ని పునీతమవడానికి ఉరకలేస్తున్న నీటివేగం... కొండల మధ్య సెలయేటికి అటు, ఇటు పచ్చని పంటపొలాలు... అక్కడక్కడున్న పచ్చిక బయల్లో మేస్తున్న పశువులు... పక్కనున్న కొండలపైనుండి మేసిన గొర్రెలను, మేకలను తోలుకొస్తున్న కాపరులు. పొలాల్లో నుండి వంచిన నడుములను పైకెత్తి పక్కనే ఉన్న సెలయేరులో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని గడ్డిమోపులను తలపై పెట్టుకొని పశువులను అదిలిస్తూ ఇంటికి తిరుగు ముఖమైన రైతులు, వారి ఇల్లాళ్ళు... తొలిక్కట్టెలు, కొడవళ్ళు చేతబట్టి తమ నివాసాలకెళ్ళే కూలీనాలీ జనాలు... డ్డి ఆకాశం కాషాయం రంగు పులుముకొంది. చంద్రగిరి కోటున్న పడమరవైపు సూర్యుడు ఎర్రటి పండులాగా అస్తమించసాగాడు. తను చిన్నప్పటి నుండీ అలవాటైన రెండుకొండల మధ్య ఉండే ఒక బండపై కూర్చొని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజూలాగే తనచుట్టూ ఉన్న పరిసరాలను తన్మయత్వంతో చూస్తూనే ఉన్నాడు. అంతలో ఆ పరిసరాల్లోనికి వచ్చిన గ్రామప్రజలు మారువేషంలో వున్న రాయలవారిని గుర్తించనే లేదు. అంగరక్షకులు గుర్రాలను తీసుకొని రాయలవారి సమీపానికి రావడం, మహామంత్రి కోపోద్రిక్తుడై కొంత పరివారంతో అక్కడికి చేరుకోవడంతో చుట్టుపక్కలున్న ఊరిజనాలకు అర్థమైపోయింది వచ్చింది శ్రీకృష్ణదేవరాయలని.

ప్రజలందరూ పరుగు పరుగునచేరి తాము తలకు చుట్టుకున్న సవకాలను నడుములకు బిగించి వినమ్రతతో రాయలవారికి నమస్కరించి నిలుచున్నారు. "ఈ చుట్టుపక్కల ఊర్లకు గ్రామాధికారి రఘునాథరెడ్డి ఎక్కడ? కనిపించడం లేదే?” అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు.

"వస్తున్నాడు ప్రభు! మొన్న బావి తవ్వుతున్నప్పుడు జారిపడి కాలికి గాయమైంది. ది అనుకుంటుండగానే వచ్చేశాడు" అన్నాడు ఓ రైతు.

"ప్రభూ! మీరు చిన్నప్పుడు చంద్రగిరి కోటనుండి తరచూ వచ్చి రెండుకొండల మధ్య ఉండే ముఖద్వారం రాయిపై కూర్చొని సాయంత్రం సమయం ఇక్కడే ధ్యానంచేసి...........................

  • Title :Koneti Rayani Kathalu
  • Author :Acharya Peta Srinivasulu Reddy
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6705
  • Binding :Paparback
  • Published Date :2025
  • Number Of Pages :264
  • Language :Telugu
  • Availability :instock