• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Harmless Criminals

Harmless Criminals By Xxx Group

₹ 300

అది మధ్యాహ్న సమయం. చెన్నై, డాక్ యార్డ్ కెళ్ళే దారి. ఆ రోడ్డు మీద ఖరీదైన కార్లు, వాటితో పాటే, లారీలు తిరగడం సామాన్యమే. ఆ రోడ్డు కొన్ని సమయాల్లో చాలా లారీలోడ్లతో బిజీగా ఉంటుంది. మిగతా సమయాల్లో ఖాళీ. జన సంచారం కొంచెం తక్కువే.

నల్లటి మెర్సిడెస్ కొత్త మోడల్ కారు ఆ నల్లటి తారు రోడ్డు మీద మెల్లగా పరిగెడుతోంది. ఆ కార్కి ముందు గాని వెనక కానీ, వాహనాలు లేవు. చాలా తాపీగా 30 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్న కారు డ్రైవర్ సీట్లో ఒక్కడే వ్యక్తి. 50సంవత్సరాలు ఉండొచ్చేమో అతనికి. మొహానికి రెండు వైపులా పెరిగిన సైడ్ లాక్తో పాటు, అక్కడక్కడా నెరిసిన గడ్డం, వేసుకున్న సఫారి సూట్ అతన్ని ముస్లిం అని సూచిస్తున్నట్టు ఉన్నాయి. ప్రతి క్షణం ప్రాణాలకి ముప్పు ఉండే, ఆ వ్యాపారంలో అలవడిన అతని డేగ లాంటి కళ్ళు అలవాటుగా చుట్టూ గమనిస్తున్నాయి. అతనికున్న ప్రమాదమైన వ్యక్తి మురుగన్ ఒక్కడే. అతడి కోసం కళ్ళు వెతుకుతున్నాయి. చెన్నై రాగానే మాట్లాడుదామని ట్రై చేస్తే, మురుగన్ దొరకలేదు. సరేలే సాయంత్రం మాట్లాడుదామని నిర్ణయించుకున్నాడు. నల్లటి తాచు పాములా ఉన్న రోడ్డు మీద తాపీగా వెళ్తున్న కార్ ఒక పెద్దగా తెరుచున్న గేటులోకి దూరింది. గేటు మీద పెద్ద పెద్ద అక్షరాలతో "భారతి డాక్" అని రాసి ఉంది. గేటు లోపలకి మెల్లగా వెళ్తున్న కార్ లోంచి, ఇంకాస్త అప్రమత్తతతో చుట్టూ చూస్తూ, పక్కనే రెడీగా ఉన్న లోడ్ చేసి ఉన్న పిస్టల్ని తడిమి.................

  • Title :Harmless Criminals
  • Author :Xxx Group
  • Publisher :Achanga Telugu Prachuranalu
  • ISBN :MANIMN6219
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :175
  • Language :Telugu
  • Availability :instock