• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Haveli

Haveli By Lalitha Varma

₹ 100

సోషియో ఫాంటసీ థ్రిల్లర్

తెలుగు సాహితీ రంగం గర్వించదగ్గ అపూర్వమైన రచయిత్రి శ్రీమతి లలిత వర్మగారు! కథ, కవిత నవల, ప్రక్రియల ద్వారా వారు తెలుగు సాహితీ పాఠక లోకానికి చిరపరిచితులు! ఏ జోనర్ లో అయినా, అలవోకగా రచన చేసి, తనదైన ముద్రతో, పాఠకులను అలరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య!

శ్రీమతి లలిత వర్మ గారు రాసిన అద్భుతమైన నవలిక “హవేలి” చదివినప్పుడు, ఒక అలౌకిక అనుభూతికి గురయ్యాను! తాను ఎంచుకున్న విషయం మీద ఆమెకున్న పరిజ్ఞానం, పట్టు, కథ నడిచిన పరిసరాల నైసర్గికత గురించి సంపూర్ణ అవగాహన, బ్రిటిష్ కాలపు నైజాంలోని సంస్థానాధీశుల చరిత్ర, వారి పోరాట పటిమ, దాయాదుల దౌష్ట్యం, వెన్నుపోటుతో కూల్చబడిన రాజకుటుంబం నుండి రక్షించబడిన వారసుడు.... ఓహ్! ఎలాంటి సాగదీతలు లేకుండా క్లుప్తమైన వాక్యాలలోనే... అనంతమైన సమాచారాన్ని అందిస్తూ కథను 'ఉరకలెత్తించిన' రచయిత్రి రచనా కౌశలం తీరు ప్రశంసనీయం!

అమెరికాలోని డల్లాస్ నగరంలో ప్రారంభమైన కథను... ఆద్య కేంద్రబిందువుగా... స్వాప్నికావస్థలో... అచేతన స్థితిలో ఆమె గాంచే విభ్రమ స్వప్నాలు, తదనంతరం జరిగే విధ్వంసాలు... గగుర్పొడిచేలా అక్షరీకరించారు.

లలితగారు!

మరొక పార్శ్వాన... అపరాధ పరిశోధనా కోణాన్ని... రుద్రాణి ఐ.పీ. ఎస్, అమ్మాయిల అపహరణలు, హత్యా ప్రయత్నాలు, నేరస్తుల కోసం శోధన, మన్యాలలోకి గూడేల ద్వారా... ఇన్వెస్టిగేషన్ మొదలై, చిట్టచివరకు దేవరకొండ హవేలీ అంతిమ ప్రస్థానంగా సాగి... నేరస్థులు, పోలీసుల మధ్య కాల్పులు, చిట్టచివరగా....................

  • Title :Haveli
  • Author :Lalitha Varma
  • Publisher :J V Publications
  • ISBN :MANIMN4829
  • Binding :Papar back
  • Published Date :June, 2021
  • Number Of Pages :93
  • Language :Telugu
  • Availability :instock