హీలింగ్
త్రయీ విద్య అంటే ఇదే. ఈ త్రయీ విద్య అనేటటువంటి దాంట్లో మూడు అంశాలు ఉంటాయి అని పేరులోనే తెలుస్తోంది. ఈ మూడు అంశాలలో కావలసినటువంటి యోగ విజ్ఞానాన్ని, కావలసినటువంటి దానిని పొందడానికి ప్రయత్నించకుండా, ఆ మూడు వేరు వేరుగా చూడడం అనేదే మనం చేసేటటువంటి తప్పు. దానిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమి చేసినా మూడు ఉంటాయి. మీరు వింటున్నప్పుడు కూడా ఆ మూడు పని చేస్తూ ఉంటాయి. కూర్చుని ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఆ మూడు పని చేస్తుంటాయి. పంచేంద్రియాలతో మనం ఏ పని చేస్తున్నా కూడా ఈ మూడు పని చేస్తూనే ఉంటాయి. ఈ మూడు వేరువేరుగా ఉంటే, మనం అవుతాం, ఈ మూడు కలిస్తే యోగం అవుతుంది...............