ముందుగా ఒక మాట
"It was the best of times, it was the worst of times .. it was the spring of hope, it was the winter of despair.(A మహా మేలు కాలం; మహాచేటు కాలం .... అది ఆశల వసంతం; అడియాసల హేమంతం). ప్రపంచ ప్రసిద్ధ చార్లెస్ డికెన్స్ నవల “A Tale of Two Cities' ప్రారంభ వాక్యాలివి. నేటి మన దేశానికీ అద్దినట్టు సరిపోతాయి.
స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం, స్కామూ స్కాండల్ లేకుండా ... అవినీతి మకిలి అంటకుండా... అక్రమాల నీచు, రాజకీయ రొచ్చు. పులుముకోకుండా పరిపాలన సాగటం అనేవి కాలానికి కొలమానాలయితే దేశానికి ఇంత మంచి కాలం కడచిన మూడు దశాబ్దాలలో మున్నెన్నడూ లేదు. అనాదిగా
భారతావనికి జీవనాడి, చోదకశక్తి అయిన సనాతన ధర్మం , నిఖిల జగతికి చదువు, సంస్కారం నేర్పిన విశ్వగురువు హైందవం చీకూచింతా లేక చల్లగా ఉండటం ప్రామాణికమైతే మాత్రం నిస్సందేహంగా ఇది ఆందోళనకరమైన ఆపత్కాలం.
మనది అమెరికన్ దేశం; మనది అమెరికా జాతి; మనది అమెరికన్ సంస్కృతి అని ఇవాళ ఎవరైనా చెపితే ఆ సంగతి మాకు తెలియదా, కొత్తగా చెప్పాలా అని అమెరికాలో ప్రతివాడూ ఎగాదిగా చూస్తాడు. మనది పాకిస్తాన దేశం, మనది పాకిస్తానీ జాతి, పాకిస్తానీ సంస్కృతి అని ఇవాళ పాకిస్తాను ఎవరు చెప్పబోయినా అంతే!
నిజానికి USA అని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నది పుట్టి తెరిచిందే నిన్నగాక మొన్న జస్ 250 ఏళ కింద! అలాగే 75 ఏళ్ల కింద............