• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Hindutva Mahilalapai Himsa

Hindutva Mahilalapai Himsa By Brudakarat

₹ 80

పరిచయం

ఆగస్ట్ 15, 2022 తేదీన భారతదేశం చారిత్రక 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, తన ప్రసంగంలో మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సోదర, సోదరీమణులారా! ఈ ఎర్రకోట నుండి నా మానసిక వ్యధను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మన రోజువారీ ప్రవర్తనలో, మాటల్లో వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నామనే విషయం చెప్పడానికి బాధగా ఉంది. మనం సాధారణంగా మహిళల్ని నిందిస్తూ, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాం. రోజువారీ జీవితంలో మహిళల్ని అవమానించి, అప్రతిష్టపాలేసే ప్రవర్తనను, సంస్కృతిని వదిలించుకోవాలని ప్రతిజ్ఞ చేయలేమా? మన దేశం కంటున్న కలల్ని నెరవేర్చడంలో మహిళల గౌరవమే మనకు పెద్ద ఆస్తిగా ఉండబోతోంది” అని ఆయన అన్నారు.

కొన్ని గంటల తర్వాత ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్లో అత్యంత హేయమైన నేరాలకు పాల్పడి (ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్, ఇద్దరు చిన్న పిల్లలతో సహా 14 మంది హత్య) శిక్షలు పడిన 11 మంది నేరస్థులు గోద్రా జైలు నుండి బయటకు వచ్చారు. జీవిత ఖైదు విధించబడిన వీరికి జైల్లో సత్ప్రవర్తనతో ఉన్నారన్న సాకుతో క్షమాభిక్షను ప్రసాదించారు. యుద్ధభూమి నుండి తిరిగొచ్చిన యోధుల వలె వీరికి పూలదండలతో సత్కరించినట్టు ఫోటోలొచ్చాయి. వీరి కేసును అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర హెూంశాఖ పరిశీలించింది. ఇలాంటి కేసులో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి లాంటి అత్యున్నత అధికారుల స్పష్టమైన అనుమతి లేకుండా క్షమాభిక్ష మంజూరు చేసే ధైర్యం ఎవ్వరూ చేయ్యరు. వాస్తవానికి గుజరాత్ ప్రభుత్వం దీనిని అక్టోబర్ 2022 లోనే నిర్ణయించింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవంలో భాగంగా ఈ పదకొండు మందిని ముందస్తుగా విడుదల చేస్తూ తమ ప్రభుత్వ మంజూరు నిర్ణయానికి కేంద్ర హోంశాఖ ఆమోదం కూడా ఉన్నదనే విషయాన్ని హిందూత్వ - మహిళలపై హింస...........................

  • Title :Hindutva Mahilalapai Himsa
  • Author :Brudakarat
  • Publisher :Nava Telangana Publishing House
  • ISBN :MANIMN5853
  • Binding :Paerback
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock