కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య
(మాస్టర్ ఇ.కె.)
సనాతనమగు వేదజీవనమును, యోగమార్గమును ఆచరణ రూపమున మాస్టర్ ఇ.కె. సుప్రతిష్ఠము చేసిరి. ఆధునిక యుగమున ఆధ్యాత్మిక జీవనము సాధ్యమని నిరూపించిరి. ఆత్మసాధన, నిస్వార్థ సేవ సమన్వయింపబడినప్పుడు “ఆనందమయ స్థితి” ప్రసాదించబడి, అది ప్రసారమగునని సాధకులకు రుచి చూపించిరి. ఆత్మజ్ఞానము పొందుటకు మార్గదర్శకములగు గ్రంథములను రచియించిరి. ఆచరణాత్మక మగు సేవా కార్యక్రమములను రూపొందించిరి. 1971 సం||లో “జగద్గురు పీఠము” అనునొక ఆధ్యాత్మిక సేవా సంస్థను స్థాపించిరి. మాస్టర్ హోమియో వైద్యాలయములు, బాలభాను విద్యాలయములను నెలకొల్పిరి. 1926 ఆగస్టు 11న జన్మించిన మాస్టర్ ఇ.కె. 1984 మార్చి 17వ తేదీన దేహ పరిత్యాగము చేసి, అంతర్యామిత్వము చెందిరి.