హౌస్ జర్నల్ అంటే ...
TIME
The Woods New Mog
టైమ్ పత్రిక ప్రారంభ సంచిక ముఖచిత్రం
సమాచార వెల్లువ. ఎటు చూసినా పలు మార్గాల ద్వారా తెరపి లేకుండా వచ్చిపడుతున్న విశేషాలు, పుస్తకాలు, పత్రికలు, టీవీలు, రేడియోలు, సినిమాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూ టర్లు.
సాధనాలకేం తక్కువ లేదు. సమాచారానికేం తక్కువ లేదు. టెక్నాలజీ పెరుగుతోంది. ఉపగ్రహాలు సాయంగా నిలిచాయి. అందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి.
పుస్తకాలను తీసుకుంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు, కథల పుస్తకాలు, నవలల పుస్తకాలు, కవితల పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వివిధ అంశా లపై వెలువడే ప్రత్యేక కేటగిరి పుస్తకాలు ఇలా ఏ అంశానికా అంశం పుస్తకాలు రెక్కలు కట్టుకుని వచ్చి మన ముంగిట్లో వాలుతున్నాయి. పుస్తకాల షెల్ఫ్ లో కొలువుదీరు తున్నాయి.
పత్రికలలో దినపత్రికలు, జాతీయ పత్రికలు, రాష్ట్ర స్థాయి పత్రికలు, స్థానిక పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, సాహిత్య పత్రికలు, సైన్స్ పత్రికలు, పిల్లల పత్రికలు, ఆధ్యాత్మిక పత్రికలు, ఇలా ఎన్నో....
ఒక్కో దిన పత్రికలో ప్రధాన పత్రిక, మహిళా అనుబంధం, జిల్లా అనుబంధం .... బిజినెస్ అనుబంధం, సినిమా అనుబంధం ....
టెలివిజన్లో వివిధ భాషలలో దేశీయ చానళ్ళు, అంతర్జాతీయ చానళ్ళు, క్రీడల దానళ్ళు, జంతు ప్రపంచపు చానళ్ళు, సైన్స్ చానళ్ళు, పిల్లల చానళ్ళు, వార్తల చానళ్ళు, వినోద చానళ్ళు .......................