ఈ పుస్తకం చదివి మంచి ఫలితాలు పొందటానికి తొమ్మిది సలహాలు
' అద్భుతాలు సాధించగలరు. ఆ గొప్పగుణం ఏమిటంటే, అది ఇతర వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలనుకునే తీవ్రమైన కోరిక, దీక్ష, పట్టుదల.
ఈ గుణాలను మీలో ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ పుస్తకం చెప్పబడిన సూత్రాలను నిరంతరం మననం చేసుకోవాలి. ఈ విషయాలపై పట్టు సంపాదిస్తే మీ జీవితం గతంలో కంటే ఎంత ఉన్నతంగా, సఫలంగా, నిండుగా ఉంటుందో ఊహించండి. వ్యక్తులతో ప్రభావవంతంగా వ్యవహరించడం వల్ల మీ ఆనందం, ప్రజాకర్షణ, విలువ పెరుగుతాయని మీకు మీరే చెప్పుకోండి.
ఏదైన ఒక ముఖ్యమైన సలహా దగ్గర అడ్డుగీత గీయండి. ఒకవేళ ఆ సలహాతో నాలుగు ముఖ్యమైన పదాలు ఉంటే వాటి పక్కన నక్షత్రపు గుర్తులు పెట్టండి. ఇలా చేయడం వలన ఆ చాప్టర్ను తిరిగి చదివేటప్పుడు ఆసక్తిగా ఉంటుంది.