• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Hyderabad

Hyderabad By Mehak Hyderabadi

₹ 100

స్వదేశీ సంస్థానాలు

భారతదేశంలో ఆంగ్లేయుల సామాజ్యవాద సౌధం స్వదేశీ సంస్థానాల స్తంభాలపై నిలిచి ఉంది. ఈ సంస్థానాలన్నీ బ్రిటిషువారి భారీ రక్షణ నిర్మాణాల నడుమ, జాగీర్దారుల దమనకాండ, అఘాయిత్యాలు, నియంతృత్వానికి పరాకాష్ఠగా చీకటి చిత్రహింసల కుహరాలుగా మారాయి. చిన్నా, పెద్దా కలిపి మొత్తం సంస్థానాలు 584 దాకా ఉన్నాయి. దాదాపు పది కోట్లమంది జనాభా ఉన్న హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణపరంగా భారతదేశంలో

మూడింట ఒక వంతు ఉంటుంది.

ఈ స్వదేశీ సంస్థానాలలో పాతుకుపోయిన కాలం చెల్లిన నిరంకుశ ప్రభుత్వాలకు తిరుగులేదు. అక్కడ ప్రజలు స్వేచ్ఛగా, సుఖసంపదలతో జీవించేందుకు వీలుకల్పించే రాజకీయ హక్కులేవీ వారికి లేవు. కొన్ని సంస్థానాలలో పేరుకు మాత్రమే సంస్కరణలు అమలవుతున్నప్పటికీ, అక్కడ సర్వాధికారాలూ సంస్థాన పాలకుడి చేతిలోనే ఉంటాయి.

ఏజెంట్ల ద్వారా పాలన

ప్రతి సంస్థానంలోనూ బ్రిటిష్ వారి తరఫున ఏజెంట్లు నియమితులయ్యారు. సంస్థానాధీశులతో వీరు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వారికి సూచనలూ, సలహాలిస్తారు. ఈ ఏజెంట్లూ లేదా రెసిడెంట్లూ ప్రతి సంస్థానంలోనూ సామ్రాజ్యవాదుల వ్యూహాలనూ, ప్రణాళికలనూ పక్కాగా అమలుచేస్తుంటారు. సంస్థాన పాలకుల సంపూర్ణాధికారం కొనసాగేలా చూడడమే వీరి పని. దీనిలో భాగంగా స్వాతంత్య్రం కోసం ప్రజలు చేసే ఉద్యమాలను సైనిక బలగాలతో లేదా ఇతర పద్ధతుల్లో వీరు నిరంకుశంగా అణచివేసి పాలకులకు అండగా నిలుస్తారు. భారతదేశంలోని సంస్థానాల వ్యవహారాలను బ్రిటిషు ప్రభుత్వంలోని రాజకీయ వ్యవహారాల విభాగం నియంత్రిస్తుంది. ఆంగ్లేయులు ఏలుబడి ప్రాంతాల్లో సంస్థాన పాలకులను ఏమాత్రం విమర్శించినా, లేదా దూషించినా రాజకుమారుల పరిరక్షణ చట్టం (Princes Protection Act ) కింద నేరంగా పరిగణిస్తారు. భారత ప్రజల స్వాతంత్ర్యోద్యమం సామ్రాజ్యవాదులకు, వారి అండదండలతో పాలిస్తున్న సంస్థానాధీశులకు సంబంధించినంత వరకు చావు కబురులాంటిదని చెప్పొచ్చు. అందువల్లే సామ్రాజ్యవాదులు ఇప్పటిదాకా ఈ సంస్థానాలను తమ చేతిలోంచి జారిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చారు. అదేవిధంగా సంస్థాన పాలక కుటుంబాల వారు................

  • Title :Hyderabad
  • Author :Mehak Hyderabadi
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN4616
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :58
  • Language :Telugu
  • Availability :instock