ఐ లవ్ మై ఇండియా
“టేక్ యువర్ సీట్...” చెప్పాడు. అసిస్టెంట్ కమీషనర్ వెంకన్న, తన ఆఫీసులోకి ప్రవేశించి సెల్యూట్ చేసిన భరర్వాత్తో.
క్యాప్ తీసి కుర్చీలో కూర్చున్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ భరద్వాజ్. ఏ.సి.పి. తనని పిలవడం ఆశ్చర్యంగా వున్నా పైకి కనపడకుండా జాగ్రత్తపడటం వల్ల మొహం ప్రశాంతంగా వుంది.
"ఇది చూడు” ఓ ఇన్లాండ్ కవరు అందించాడు వెంకన్న.
భరద్వాజ్ బుర్రలో కదులుతున్న ఆలోచనలు చెదిరిపోయాయి. ఆ కవరు తెరిచి చదివాడు. ఈ మధ్య నగరంలోని ఒక చిట్ఫండ్ కంపెనీ హఠాత్తుగా మూతపడింది. దాని యజమాని కోట్ల రూపాయల సొమ్ముతో రాత్రికి రాత్రి అదృశ్యమయ్యాడు. అతని చిరునామా రాసి వుండటంతో ఆ ఇన్లాండ్ కవర్ని నిశితంగా పరిశీలించాడతను.
ఆ కవరు కంట్రోలు రూముకి వందగజాల దూరంలోని పోస్టు ఆఫీస్లో పోస్ట్ చెయ్యబడింది. అక్షరాలు నీట్ గా టైప్డ్చేసి వున్నాయి. చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారం నగరంలో సంచలనం కలిగించింది. దాని యజమాని ఉనికి తెలియజేసిన వారికి నగదు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. అందువల్ల సమాచారం ఇవ్వదలిచినవారు అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు.
అసిస్టెంట్ కమీషనర్ తో అదే అన్నాడు భరద్వాజ్.
"అనవసరమైన సందేహాలతో సమయం వృధా చెయ్యకు. వాడు బెంగుళూరు నుండి మకాం ఎత్తేయక ముందే వెళ్ళి అరెస్ట్ చెయ్యి. నాకు తెలిసినంతవరకూ డిపార్టు మెంట్లో నువ్వొక్కడివే సమర్థుడివి..." అన్నాడు ఏ.సి.పి..................