• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Iddaru Tallulu

Iddaru Tallulu By Ande Narayanaswamy

₹ 200

ఇద్దరు తల్లులు

ఆ వాళ మాలతి పుట్టినరోజు పండుగ. ఇల్లంతా కళకళ్ళాడుతూ వుంది. అప్పుడు వుదయం యెనిమిది గంటలవుతుంది. తోటలోనుంచి అంజనీలు, అరటిచెట్లు, మామిడి మండలు తెచ్చి, అరటి చెట్లు స్తంభాలకు కట్టి, మామిడి మండలు తోరణాలు కడుతున్నారు. ఈశ్వరరావు పిలవవలసిన వాళ్ళను పిలుస్తూ, దిగుపడిన సామాగ్రిని బజారునుండి తెప్పించడంలో నిమగ్నుడై వున్నాడు. రుక్మిణి యిద్దరు ముత్తైదువులను వెంటతీసుకుని గ్రామంలో పేరంటానికి పిలవడానికి వెళ్ళింది. ఇంటి వెనుక వసారాలో వంటప్రయత్నాలు జరుగుతున్నవి. సుభద్రమ్మగారు యెవరికి పురమాయించే పనులు వాళ్ళకు పురమాయిస్తున్నది. యిద్దరు స్త్రీలు కళాయి దగ్గర కూర్చుని పిండివంటలు చేస్తున్నారు. యిద్దరు కత్తిపీటల దగ్గర కూర్చుని కూరలు తరుగుతున్నారు. ఒకతను చింతపండు విడదీసి గంగాళంలో నానవేస్తున్నాడు. ఆ పంచకు కొంచెం అవతల ఖాళీస్థలంలో నారింజచెట్టు దగ్గర మాలతికి వాళ్ళ మేనేత్త పార్వతమ్మ తలంటి నీళ్లుపోస్తున్నది. నారింజచెట్టుకు ఆవతలగా కొందరు స్త్రీలు చాపమీద కూర్చుని తలలు దువ్వుకుంటున్నారు. కొందరు స్త్రీలు తలలు దువ్వుకొని నారింజచెట్టు కుదుల్లో సబ్బుతో ముఖం కడుక్కుంటున్నారు.

"ఏం, పార్వతమ్మ వదినె! కాబొయ్యే కోడలనా యివ్వాళే యెర్రపడేటట్టు తోమిస్తున్నావు?” అంది వకామె. పార్వతమ్మ మందహాసం చేసింది. “నీ కొడుక్కి యెన్నేళ్ళమ్మాయ్?” అని అడిగింది మరొకామె.

"మా రెండోవాడికా! యెనిమిదేళ్ళు పిన్నీ” అంది పార్వతమ్మ.

అయితే, యింకేం, ఈడేగా! మాలతికి యేడేళ్ళు, చక్కగా చేసుకోవచ్చు. మేనరికం కలిసేది యెంత అదృష్టవంతులకో! మా అన్న కూతురు మా మూడో వాడికంటే రెండేళ్లు పెద్దదని ఈడుగాక ఊరుకున్నాను. మా రెండో వాడికి చేసు......................

  • Title :Iddaru Tallulu
  • Author :Ande Narayanaswamy
  • Publisher :Navamalleteega Mudranalu Vja
  • ISBN :MANIMN5764
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2023 2nd print
  • Number Of Pages :283
  • Language :Telugu
  • Availability :instock