• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ila Vaikunthapuramu

Ila Vaikunthapuramu By Polkampalli Santhadevi

₹ 250

కపోత విలాపం

నా పేరు చిన్ని. నా జతగాడి పేరు చిన్నా. మా పూర్వికులెప్పుడో మా అమ్మ శారదమ్మగారి పుట్టింటినుండి వచ్చారట. మేం రాలేదు. అందంగా, తెల్లగా ఉన్నామని ఒక జతని పెంచుకోడానికి తీసుకొచ్చారట. వాళ్ళ సంతానం తామర తంపరగా వృద్ధి చెంది ఇప్పుడు ఒక గుంపుగా తయారైంది. మేమంతా రెక్కలు విప్పుకొని ఒక్కసారి ఎగిరితే 'జుయ్'మని ఎంత శబ్దం వస్తుందని! మా అమ్మగారి కొడుకులకి మేమంటే ఎంత ముద్దో! ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు జోటింగ్కి (జ్యోతిర్లింగరాజు) మేమంటే మరీ ముద్దు. ఎప్పుడూ మమ్మల్ని ఎత్తుకుని ముద్దు చేసేవాడు. ఇంకెవరు ఎత్తుకున్నా మేం భయంతో గింజుకునేవాళ్ళంగాని జోటింగ్ చేతిలో ఇష్టంగా ఒదిగిపోయేవాళ్ళం. మా రెక్కలని మృదువుగా నిమిరి తన అపేక్షని మాకు తెలియజేసేవాడు.

మాకు చక్కని ఆహారం పెట్టేవాడు. జొన్నలు, గోధుమలు,.. అన్నిటికంటే పప్పు ధాన్యాలు, పల్లీలంటే - వాహ్! లొట్టలేసుకుంటూ తినేవాళ్లం. చేతిలో పల్లీలు పట్టుకొని పిలిస్తే చాలు.... అతడి మీద దాడి చేసినట్లుగా పడి పల్లీలు తినేసేవాళ్ళం. అతడి భుజాల మీదా, చేతులమీదా వాలినప్పుడు అతడి కళ్ళలో చెప్పలేని వాత్సల్యం పెల్లుబికేది. అతడి దగ్గరున్నంత చనువు ఇంక మాకు ఇంకెవరి దగ్గరా లేదు. స్కూల్ నుండి ఇంటికి రాగానే పుస్తకాలు గూట్లో పడేసి మా దగ్గరికి వచ్చేవాడు. ఎప్పుడూ మా గొడవలో పడి చదువుకోవడం లేదని వాళ్ళమ్మగారు తిట్టేవారు, “ఈ పావురాలను ఎవరికైనా పట్టిస్తే గాని నువ్వు చదువుకోవు" అని! నిజంగా నా గుండె గుభేల్మనేది మమ్మల్ని ఎవరికైనా పట్టిస్తారా అని.

ముందు గదిలో సజ్జమీద చెక్కలతో కట్టిన గూళ్ళలోనే మా నివాసం. ఇంట్లోకి బంధువులెవరైనా వచ్చినా, కొత్త వాళ్ళొచ్చినా ముందు మాకే కనిపించే వాళ్ళు. "అమ్మగారూ! మనింటికి ఎవరో వచ్చారు చూడు" అంటూ మా భాషలో తెలియజేసేవాళ్ళం...............

  • Title :Ila Vaikunthapuramu
  • Author :Polkampalli Santhadevi
  • Publisher :Polkampalli Santhadevi
  • ISBN :MANIMN4165
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :292
  • Language :Telugu
  • Availability :instock