Logili Books

All

Inquilab

By S Vinay Kumar

₹230
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Inquilab
Author
Publisher
Nava Telangana Publishing House
ISBN
MANIMN6298
Binding
Papar Back
Published Date
Jan, 2025
Number Of Pages
230
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాట

ఈ పుస్తకానికి నేను ముందుమాట రాస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకు దక్కిన గౌరవం. నేను ముందు మాటలు రాసిన ఇతర పుస్తకాల కంటే ఇది భిన్నమైంది. ఇది కేవలం విద్యా సంబంధమైన కసరత్తు కాదు. సామాజిక, రాజకీయ అంశాలు ఇందులో ఉన్నాయి.

ఇది ఎందుకని సామాజిక, రాజకీయాలకు సంబంధించిన పుస్తకమంటే భగత్సింగ్ విప్లవానికి కట్టుబడి పోరాడిన వ్యక్తి మాత్రమే కాదు. ఆయన లక్ష్యం కేవలం రాజకీయ విప్లవం కాదు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న సామాజిక వివక్ష కూడా అంతరించాలని ఆయన కోరుకునేవాడు. భగత్సింగ్ గురించి రాసిన చాలా పుస్తకాలు ఆయన సామాజిక కార్యక్రమాన్ని విస్మరించాయి. ఆయన్ని కేవలం వలస పాలన వ్యతిరేకిగా, జాతీయవాదిగా చూపెట్టాయి. అంతవరకే చూపితే అది వాస్తవం కాదు, సమగ్రమూ కాదు. భగత్సింగ్ ఒక్కడే జాతీయ పోరాటంలో ఉరికంబం ఎక్కలేదు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఉరికంబమెక్కారు. ఆయనకు ముందు స్వాతంత్ర పోరాటంలో ఉరికంబాలు ఎక్కిన వారు మరెందరో ఉన్నారు. కానీ ఆయన విషయం పూర్తిగా వేరు. ఎంతో గొప్ప మేధో వారసత్వాన్ని మనకు అందించి వెళ్లారు. తన కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక అంశాలపై రాజకీయ, సామాజిక దృష్టితో చాలా చాలా రచనలు చేసి మనకందించారు. కులం, మతం, భాష, రాజకీయాల వంటి అంశాలపై ఆయన రాశారు.

"ఇంక్విలాబ్ : మతం, విప్లవంపై భగత్ సింగ్" అన్న పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకంలోని కొన్ని రచనలు ఆయన ఒక రాజకీయ మేధావి అని ధృవపరుస్తాయి. 1920వ దశకంలో భగత్ సింగ్ ఏమి రాశాడో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రత్యేకించి కుతకుతలాడుతున్న విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, విస్తరిస్తున్న విభజన రాజకీయాల నేటి స్థితిలో ఈ పుస్తకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?