• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Megha Padham

Megha Padham By N V S Reddy

₹ 500

 

పురుషులందు పుణ్యపురుషులు వేరయా'

-డా|| ఎన్.గోపి పూర్వ ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం

ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజింతు రురువిఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ భృత్యున్నతోత్సాహులై

ప్రారబ్దార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.. సుప్రసిద్ధమైన ఈ భర్తృహరి సుభాషితం ఎన్వీయస్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సరిగా సరిపోతుంది. ఏమిటి దీనరం? తక్కువ స్థాయిలో ఆలోచించేవారు ఆటంకాలకు భయపడి ఏ పనిని మొదలు పెట్టరు. కొందరేమో పెద్ద పెద్ద ఆటంకాలకు సంసిద్ధమై కూడా ప్రారంభిస్తారుగాని మధ్యలోనే వదిలేస్తారు. ఇక మూడోవారు ధీరులు. వీరు తలపెట్టిన కార్యాన్ని వదిలెయ్యకుండా సాధించేదాకా కొనసాగిస్తారు. ప్రజానిధులంటే వీరే. వీరిబలం స్వప్రయోజనంలో కాకుండా సర్వశ్రేయోకాంక్షలో నిక్షిప్తమై వుంటుంది.

ఎన్వీయస్ రెడ్డి లాంటి బక్కపలుచని వ్యక్తి ఐరావతం లాంటి మెట్రోరైల్ ప్రాజెక్టును సాకారం చేసుకున్నాడంటే అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా సిద్ధించింది. కాదు. సివిల్ సర్వీసకు సంబంధించిన కెరీర్ను వదులుకొని, కేంద్ర సర్వీసులోని 'భద్రతను తోసిరాజని, ఒక దార్శనికత (Vision) తో సాగిపోయిన ప్రపంచ బాటసారి 'ఎన్వీయస్. కలలుగన్నాడు, వాటికోసం దశాబ్దాలుగా శ్రమించాడు. సంకిషమైన ఒక వాస్తవిక ప్రపంచ పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. రాజకీయాలను ఛేదించాడు ! కుహనా ఉద్యమాల దుమారాలను ఊదేశాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది. అంత ఆశావాదంతో, ఆలోచనల్లోని స్పష్టతతో. అతని మేధ ఎదుగుదలకు బీజం వేసే అతని హృదయం పట్టుదలకు దారులు తీసింది.

  • Title :Megha Padham
  • Author :N V S Reddy
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN3383
  • Binding :paperback
  • Published Date :May, 2022
  • Number Of Pages :398
  • Language :Telugu
  • Availability :instock