• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Insincerely Yours Girisham Cartoons

Insincerely Yours Girisham Cartoons By Kamal

₹ 199

గిరీశం మీద కార్టూన్లు వేసి సాహసం చేసిన ఏకైక ' డింభకుడు' కమల్
 

INSINCERELY YOURS

| గిరీశం గారు "తెలుగు వెలుగు "అంటే మా వయసు వాళ్ళకి తప్పించి తక్కిన వాళ్ళకి తెలియదంటాను. ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఇంగ్లీషు కలవాటై పోయారు. అసలు సిసలు తెలుగుదనం వుట్టిపడే పరిసరాలూ లేవు. వాళ్ళకి తెలుగు భాష ఔన్నత్యాన్ని విడమరిచి చెప్పగలిగే ఓపికా మనకి లేదు. రోజులు మారుతున్నాయి. మనిషి తిరులూ మారుతున్నాయి. ప్రతి మానవుడూ పని వున్నా లేకపోయినా | వురకలేసుకుంటూ ముందుకు దూసుకు పోతున్నాడు. బాట నేరుగా వున్నా. వంకరటింకరగా వున్నా, ఎగుడుదిగుడులున్నా ససేమిరా "గో టు హెల్ డామిట్ "అని సాగిపోవటమే కర్తవ్యం అంటున్నాడు.

ఒక అరవై సంవత్సరాలు రీవైండ్ చేసి వెనక్కెళితే అప్పటి రోజుల్లో ఇంత హాడావిడి లేదు. నెమ్మదిగా హాయిగా కధలూ కాలక్షేపాలతో, డామిట్ కథ అడ్డం తిరిగిందే" అనే సరదా కబుర్లతో ''హవానా బ్రాండ్' చుట్ట వెలిగించి దమ్ములాగుతూ, కొడి గట్టితే, చిటికె వేసి దులుపుకుంటూ, అడపా దడపా నాలుగు ఇంగ్లీషు ముక్కలు విసిరి కళాపోషణ, దేశోద్ధరణ. సంఘ సంస్కరణ అంటూ లెక్చర్లు దంచుతూ, పిల్లలకి లెక్కల పాఠాలు అయిదూ పదులకి నేర్పిస్తూ. జేబులో మిగిలిన పావలా అర్థూపాయ్ రూపాయ్ బిళ్ళలతో ఒక పెగ్గు కొని నోట్లో పోసుకుని, మేఘాల్లో తేలిపోతూ ఎవరైనా అందాల లిరి లోజీలు కంట బడతారా చిన్నగా కన్నుకొట్టి ముసిముసి నవ్వులతో జీవితాలు లాగించేద్దామా అనే అంత ఆనందంగా ఆలోచించే యువత కనిపించే వాళ్ళు ఎటువైపు చూసినా, బజార్లో చెరువుకట్ట మీదా. మర్రి చెట్టు కిందా నందు మొనల్లో, పూటకూళ్ళమ్మ మెస్సులో, వీధి పెంకుటిళ్ళ అరుగులమీదా!

మీ పేరేంటి సుబ్బారావ్ అని అడిగామనుకోండి. సారీ. నా పేరు సుబ్బారావ్ కాదండీ. గిరీశం ఎం.ఏ... ఎం లిట్.. అండీ అని భుజం మీద కండువా వరుకునే శాల్తీలూ మన ముందు సాక్షాత్కరించే వాళ్ళు. అరవైయేళ్ళ వెనకేం ఖర్మ సరిగ్గా 132 సంవత్సరాల క్రితం అంటే, 1892 లో కూడా గిరీశం గార్లున్నారు. కావలిస్తే, గురజాడ వెంకట అప్పారావ్ గారి మీద ఒట్టు, ఆయన రాసిన "కన్యాశుల్కం "నాటకం చదవండి అది చాలా గొప్ప తెలుగు రచన ఆ నాటకంలో సూపర్ హీరో మన గిరీశం గారే. ఆయన్ని చూస్తే కళ్ళు జిగేల్ మంటాయి. అందుకే బాపూ గారు ఆయన మీద ముచ్చటపడి | బొమ్మ గీసి మనకి చూపించారు. దటీజ్ వై. గిరీశం గారు "తెలుగు వెలుగు "గా కీర్తి ప్రతిష్టలందుకున్నారు.. పై పెచ్చు మన సినిమా ప్రొడ్యూసర్లు సినిమాలు కూడా తీపి చూపించారు. యూ | ట్యూబులో ట్రయ్ చేయండి. 1955 సినిమా. ఎంటీఆర్ గారు ఆ పాత్రలో కనిపిస్తారు. ఆయనతో పాటు, అందాల తారలు బుచ్చమ్మగా, షావుకారు జానకీ, మధురవాణి గా సావిత్రి మనకి కను విందు | చేస్తారు. గిరీశం గారు ఎంత స్పెషలో. ఆయన గారు ఎవెరెవరికి లైను వేశారో తెలిసి కళ్ళు పెద్దవి చేసుకుంటాం. మన కళ్ళలో 'హార్ట్ ఎమోజీలూ 'పళ్ళికిలిస్తారు....................

  • Title :Insincerely Yours Girisham Cartoons
  • Author :Kamal
  • Publisher :Kamal Publications
  • ISBN :MANIMN5845
  • Binding :paperback
  • Published Date :2024
  • Number Of Pages :204
  • Language :Telugu
  • Availability :instock