భారతీయత జాతీయ సమైక్యత
ముందుగా నాకు ఉత్తేజం కలిగించే మంగళ శ్లోకాన్ని, దాని సారాంశాన్ని తెలియపరుస్తాను.
"విద్యా కైరవకౌముదీమ్ శ్రుతిశిరః సీమంతముక్తామణిమ్
దారాన్ పద్మభువస్త్రిలోకజననీమ్ వందే గిరామ్ దేవతామ్”
కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానకవి, అలంకార శాస్త్రంలో ప్రావీణ్యుడైన విద్యానాథుడు "ప్రతాపరుద్రీయం"లో ఈ మంగళ శ్లోకాన్ని రచించాడు. నేను రెండు వరుసలను పఠిస్తాను.
"తామర పువ్వుల నుండి ఉద్భవించి, ముల్లోకాలకు తల్లివంటిదైన, ఎవరి వలన అందరికీ ఉల్లాసం కలుగుతుందో, ఎవరిని వేదాంతం వలన తెలిసికొనగలమో అటువంటి దేవేరి అయిన వాగ్దేవికి నా ప్రణామాలు".
పూర్వ కాలం భారతదేశ చరిత్రను అవలోకనం చేసుకొన్నట్లయితే, కొన్ని స్వతంత్ర రాజ్యాలుగాను (suzerians), మరికొన్ని పరతంత్ర రాజ్యాలుగా (vassals) కొనసాగుతుండేవి.
భారతదేశం ఏ కాలంలోను ఐక్యతను సాధించలేకపోయింది. అవి చిన్న రాజ్యాలు కావడం, ఒకరిపై మరొకరికి ద్వేషం, దాడులు జరుపుతూ ఓడిన వారి సంపత్తిని దోచుకొని వారిని నిర్వీర్యం చేయడం, లేదా తమకు అనుకూలురను పరాధీన రాజ్యాలుగా గుర్తించడం, అమలులో ఉన్న ఆచారాలను, న్యాయాన్ని, మతాన్ని ధ్వంసం చేయడం వంటి వాటితో పాటు ఏ రాజుకు విశాల సామ్రాజ్యాన్ని.......................