• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ivee Mana Moolaalu

Ivee Mana Moolaalu By Kalluri Baskaram

₹ 450

సాహసం, కానీ ఎంతో అవసరం

కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. 'మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.

ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి 'ఇన్సైడర్'కు 'లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన 'మోహన్ దాస్'కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన 'కౌంటర్ వ్యూ' చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, 'వేయిపడగలు నేడు చదివితే' చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక 'మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.

ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు 'ఇవీ మన మూలాలు' పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.

----ఇవీ మన మూలాలు 7

  • Title :Ivee Mana Moolaalu
  • Author :Kalluri Baskaram
  • Publisher :Astra Publishers
  • ISBN :MANIMN4994
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :355
  • Language :Telugu
  • Availability :instock