• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

J S Hasya Kathalu

J S Hasya Kathalu By J S Lakshmi

₹ 100

హాస్య కథలు

"అమ్మగారికి దండం పెట్టూ..." "ఏంటే అక్కయ్యా.. ఈ పెళ్ళి కైనా నువ్వు రాకపోతే ఇంక నీకు ఫోన్ చేయనంతే .

".." ఏదో చెప్పబోతున్న రేణుక మాటల్ని మధ్యలోనే ఆపేసి, "అసలు నువ్వే చెప్పవే.. ఎన్నాళ్ళైంది మనం కలిసి? పదేళ్ళు దాటటంలేదూ.. ఎప్పుడో పెద్దమావయ్యగారి పెద్దబావ పెళ్ళికి వచ్చేవ్. అంతే.. మళ్ళీ మనం కలవందే. నా పెళ్ళిక్కూడా రాలేదు. మా ఆవిణ్ణి చూడవూ?

"సరే.. చూస్తాలేరా.." అని ఫోన్ పెట్టేసింది రేణుక.

రేణుక వుండేది పూనెలో. రాజమండ్రీలో బుల్లిమావయ్య కూతురి పెళ్ళి. రాంబాబు ఈ విషయం గురించి అప్పుడే రెండోసారి ఫోన్ చేసేడు. ఈ ఉద్యోగాల్లో చుట్టాల పెళ్ళిళ్ళంటే సెలవులివ్వరుకదా. అదీకాక పిల్లలు రమ, సుమల చదువులోటీ. పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు సెలవు లిచ్చినప్పుడల్లా హైదరాబాదు అమ్మావాళ్ళింటికెళ్ళి పదిరోజులుండి వచ్చెయ్యడం తప్పితే చుట్టాలెవర్నీ కలవడం కుదిరేదికాదు. పిల్లలు కాస్త పెద్ద చదువులు కొచ్చేక ఆ వెళ్ళడం కూడా తగ్గిపోయింది. ఇంక ఈసారి పెళ్ళికెలాగైనా వెళ్ళాలనుకుంది.

రాంబాబు రేణుకకి చిన్నబాబాయ్ కొడుకు. వేసంకాలం వచ్చేసరికి మావయ్యలూ, పిన్నిలూ అందరూ పిల్లలతో సహా రాజమండ్రి అమ్మమ్మ గారింటికి చేరిపోయేవారు. ఆ సెలవులన్నీ ఎంత హాయిగా గడిచిపోయేవో. తల్చుకుంటే ఇప్పటికీ మనసులోంచి సంతోషం తన్నుకుంటూ పైకొచ్చేస్తుంది.

ఆ సంతోషం మళ్ళీ ఎవరితో పంచుకోగలం? కట్టుకున్న మొగుడితో చెప్తావంటే ఆ చిన్నప్పటి పిల్లచేష్టలు విని తర్వాత సందర్భం దొరికినప్పుడల్లా వెటకారం చేస్తాడేమోనని రేణుక భర్త ముందు ఎప్పుడూ ఆ విషయాలే ఎత్తదు. పోనీ ఆ సరదా విషయాలు పిల్లలతో పంచుకోడానికి రేణుక ఎప్పుడైనా "మా పెద్దమావయ్య తెలుసా.." అని మొదలు పెట్టగానే వాళ్ళు "అబ్బా... అమ్మా... నువ్విప్పుడా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళకు..వచ్చె.. వచ్చె.. ప్రజంట్ కొచ్చె.." అని ఓ దండం పెట్టేస్తారు. అంతే.. మరింక ఆ మాట ఎత్తదు.

కాని రేణుక మనసు అప్పుడప్పుడు చిన్నప్పటి కబుర్లు ఎవరి తోనైనా చెప్పుకుందుకు తహతహలాడిపోతోంది. అందుకే ఈ పెళ్ళి కబురు వినగానే.............

  • Title :J S Hasya Kathalu
  • Author :J S Lakshmi
  • Publisher :J S Lakshmi
  • ISBN :MANIMN4992
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2017 first print
  • Number Of Pages :98
  • Language :Telugu
  • Availability :instock