• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jagadguru Prashasti

Jagadguru Prashasti By Jatavallabhula Purushotam

₹ 120

JAGADGURU SRI SANKARACHARYA SWAMIGAL

Srimatam Samsthanam

No.1, Salai Street, KANCHEEPURAM- 631 502

Date: 21-04-2021

మా పరమగురువులు 1936-39 లలో కోస్తా ఆంధ్ర ప్రాంతములలో విస్తారమైన పర్యటనలు చేసినారు. వారిచే ధృతితోను నియమముతోను పాటించబడి ధర్మాచర ణము, వారి పరమ కారుణికత, దైవీ విభూతి మహాపండితులనుండి పామరుల వరకు అందరినీ ఆకర్షించినది. వారందరూ వారిని నడిచే బ్రహ్మ పదార్థమని, నడయాడు దైవమని కొనియాడి కొలుచుకొనినారు. ఈ విధముగా శ్రీచరణుల శ్రీచరణములనాశ్రయించిన మహాపండితులలో మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, శ్రీ మండలీక వేంకటశాస్త్రి గారు, శ్రీ కుప్పా లక్ష్మావధాని గారి వంటివారెందరో ఉన్నారు. శ్రీజటావల్లభుల పురుషోత్తముగారు ఆ కోవకు చెందినవారు.

సంస్కృతాంధ్రములలో మహాపండితులైన శ్రీ పురుషోత్తముగారు గొప్ప దేశ భక్తులు. స్వాతంత్ర్య సంగ్రామములో పాల్గొని చెఱసాలకేగిన సనాతనధర్మ పరాయణులలో వీరొకరు. హైందవ దేశ అభ్యున్నతికి సనాతనధర్మమును, సంస్కృత భాషావ్యాప్తియు శరణ్యమన్న మొక్కవోని వీరి విశ్వాసమే వారిని సంస్కృతభాషా ప్రచారకులుగను, ధర్మప్రచార దీక్షితునిగను చేసినది. 1937లో మహాస్వామివారి అధ్యక్షతన అనేకమంది మహాపండితులు, సన్యాసుల నడుమ జరిగిన "ముక్కామల"లో "బ్రహ్మసత్రము” సందర్భమున వీరికి స్వామివారి ఆదరణ లభించినది. 1938లో శ్రీ చరణులు వీరి ఆహ్వానముపై కొవ్వూరు సంస్కృత పాఠశాలకు విజయంచేసినారు. శ్రీ పురుషోత్తముగారు సంస్కృతాంధ్రాంగ్లేయ భాషలలో జిజ్ఞాసువులు ఉఱూత లూగించెడి ప్రసంగములు చేయుటలో దిట్ట. సనాతనధర్మ ప్రచార విషయములో వీరు ఆకాశవాణిలోను, వేలాది సభలలోను ప్రసంగములు చేసినారు. వీరు వ్రాసిన అనేక గ్రంథములలో హైందవధర్మమునకు కరదీపికగా చెప్పనగు "హిందూమత మొకటి. మహాస్వామివారి అనుమోదములతో వీరికి "ధర్మోపన్యాస కేసరి” బిరుదము ఈయబడినది. అప్పటికే వారు "ఆర్షవిద్యాభూషణులు" - స్వామివారు తమ శిష్యస్వాములవారైన మా గురువుగారితో రెండవతూరి 1966-68 లలో...................

  • Title :Jagadguru Prashasti
  • Author :Jatavallabhula Purushotam
  • Publisher :Akshagna Publications Prachurana
  • ISBN :MANIMN5988
  • Binding :Papar Back
  • Published Date :May, 2021
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock