Jagadguru SriSankaracharya Virachita Aatmabodhana (Second Impression) By Syama Shastri
₹ 100
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్యామ శాస్త్రిగారు వారి తండ్రిగారి వద్దను, సురభారతిసన్నిధిలోను, గోకర్ణము, మరియు వారాణసి క్షేత్రములలోను గురుముఖంగా శాస్త్రాధ్యయనమొనర్చి సురభియైన భ్రహ్మవిద్యావ్యాసంగముతో జీవితమును అమృతమయ మొనర్చు కొనుచున్న మహనీయులు. స్వాధ్యాయాధ్యాయన సంపన్నులుగా విరిదివరకే బ్రహ్మసూత్రములు మొదలగు ప్రస్థానత్రయ గ్రంధములను ప్రచురించి, అటు శ్రీరామకృష్ణ మతమువంటి సంస్థలకు, ఇటు విద్యార్థులకు మిక్కిలి విలువైన సేవలందించి యున్నారు. ఇప్పుడు జగద్గురు శ్రీ శంకరాచార్యవిరచిత ప్రకరణ గ్రంధములందొకటియైన - ఆత్మబోధన - ఉపనిషద్వాక్య సముల్లసితోదాహరణాయుతముగా వ్యావహారిక ఆంధ్రభాషయందు సమకూర్చి ముముక్షుమనసాహ్లోదాము గావించారు. అనుచాన వెదికాచారసంపన్నులు. అద్వైతమార్గ జీవాణులు. పంచసప్తతివయః పరిపాక ప్రభావిష్ణులునగు వీరి వాక్యములెల్ల సుబోధకములై అన్ని ఉపనిషత్తుల వాక్యముల క్రోడీకరణలతో ఈ గ్రంధమును వేదాంత పాఠకులకు అత్యంత ఉపయోగకరముగ తీర్చిదిద్దినారు.
-ఆచార్య శ్యామ శాస్త్రి.
- Title :Jagadguru SriSankaracharya Virachita Aatmabodhana (Second Impression)
- Author :Syama Shastri
- Publisher :Yugadi Publishers
- ISBN :MANIMN0588
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :146
- Language :Telugu
- Availability :instock