₹ 200
అగ్ర నగరంలో అత్యంత శోభాయమానంగా వెలిగిపోయే దివ్య మందిరాల మధ్య వుంది శిష్ మహల్! రాజదంపతులు, బేగములు వంటి ప్రాముఖ్యం గల స్త్రీలు అంత అందులోనే జలకాలాడుతుంటారు. చంద్రకాంత శిలలతో నిర్మితమయి, ముత్యపు చిప్పలతో , నవరత్నాలతో అలంకరించబడి చూడటానికి ఎంతో అందంగా వుంటుంది.
సహస్ర బాహువులు వున్న దీపాలకుండీ పై నుంచి వేలాడుతోంది అందులో వున్న జలాశయం చాలా విశలంగావుంది. మధ్యలో వున్న జలస్తంభం నుంచి సుగంధాలు కలిపిన పన్నీరు నిరాటకంగా, శంకరుని జటాజూటంనుంచి వెలువడే గంగా తరంగిణిలా ఎగజిమ్ముతోంది.
జలాశయం చుట్టూ చంద్రకాంత శిలావేదికలున్నాయి. అందులో కొన్ని ముఖ్ ముల్ దిండ్లతో అలంకరరించబడి వున్నాయి. జలకమాడవచ్చిన స్త్రీలు వాటిపై కూర్చుని వుంటే వారి దేహాలకు సుగంధాలను పూసి, మర్ధనా చేస్తారు పరిచారికలు. తర్వాత ఆ జలాశయంలో స్నానమాడి , నూతన రత్నంబరాలు ధరించి, అక్కడ విశ్రమిస్తారు.
- Title :Jahanaaraa- Roshanaaraa
- Author :N S Nagireddy
- Publisher :Brilliant Books
- ISBN :MANIMN1117
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :205
- Language :Telugu
- Availability :instock