విఠలాచార్య చిత్రాలలో పాటలు వీనులకూ, కనులకూ విందు
- వి.ఎ.కె. రంగారావు
ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు
“సంగీతమటే రచనా, వరసా' అని శాస్త్రార్థం. దానికి మనం పాడటమూ జోడించుకోవచ్చు. శాస్త్రీయ సంగీతంలో కాని, సినిమా పాటల్లో గాని పాడేవారి సామర్థ్యం వలన వాటి సొగసు పెరగడం తెలిసిన విషయమే. ఇక ప్రత్యేకంగా సినిమా పాటకు వచ్చేసరికి అందులో చిత్రీకరణ కూడా ఒక భాగమే అన్న సంగతి సూక్ష్మంగా గమనించే వారికి బోధపడుతుంది.
ఇన్ని రకాల రంగులూ హంగులూ విఠలాచార్య చిత్రాలలో గమనించగలం. ఆయన ఎన్నో సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించినా, 'జానపదబ్రహ్మ'గానే ఆయనకి పేరు, ప్రతిష్ఠా! ఆయన తీసిన సాంఘికాల వంటివి ఇతరులూ అంతకుముందే తీసివుండవచ్చు. కానీ ఆయన జానపదాలలో కనబడే మంత్రాలు- మాయలూ, జంతువులూ-రాక్షసులు, దయ్యాలు-దేవతలూ, దేవుళ్లు-దేవేరులూ మరోచోట యింతగా విజృంభించలేదనే చెప్పుకోవచ్చు.
తెలుగులో విజయఢంకా మ్రోగించిన మొదటి జానపదం జెమినీవారి "బాలనాగమ్మ" (1942), తెలుగు..............