డబ్బు పాపిష్టిది!
నేషనలైజ్డ్ బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఉన్న టొంబాయిలో రీజినల్ మేనేజర్ స్థాయి లీలాధర్ ది. అఫీషియల్ మీటింగ్ ఉండి పట్టణంలోని పెద్ద స్టార్ హోటల్ లో దిగాడు.
వచ్చిన అతిథి, బ్యాంకులో పెద్ద మేనేజర్ అని గుర్తించిన లిఫ్ట్ బాయ్ "సార్ నా వద్ద మారని వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటికి కొత్త నోట్లు ఇప్పిస్తారా" అని వినయంగా అడిగాడు.
"అయ్యో, మార్చుకోవడానికి గడువు అయిపోయింది కదండీ"
బాధగా ముఖం పెట్టిన లిస్ట్ బాయ్ "ఎలాగోలా మార్చుకోవచ్చని ఆశపడ్డాను. సార్. చేతిలోని డబ్బు చెల్లనిదని తలుచుకుంటే బాధేస్తోంది. డబ్బు విలువ ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది"
"అది అంతే బ్రదర్, మనిషి తయారు చేసే డబ్బు మనిషి జీవితాల్ని శాసిస్తుంది.
డబ్బుంటే హీరో, లేకుంటే జీరో ఈ సమాజంలో" అంటూ గదిలోకి వెళ్ళాడు. రాత్రంతా మనీ సంబంధిత పత్రికలను తిరగేసి హాయిగా నిద్ర పోయాడు.
తెల్లారిందే... నిద్ర లేచి షూస్ వేసుకుని వాకింగ్ బయలుదేరాడు. పట్టణంతో తనకున్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ నడుస్తున్నాడు. 'అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఈ పట్టణంలో పని చేశాను. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు. ఎకరాల కొద్దీ పంట పొలాలు అపార్ట్ మెంట్ నిలయాలుగా, పెద్ద కాలనీలుగా రూపాంతరం చెంది ఉన్నాయి' అని ఆశ్చర్య పోయాడు.
చిన్నగా నడుస్తూ ఉంటే పెద్ద అందమైన కాంప్లెక్స్ ఒకటి దారిలో కనిపించింది. పరిశీలనగా చూస్తే అది పట్టణ వాసులు నిర్మించుకున్న గ్యాస్ ఆధారిత క్రమటోరియం. పేరుకు అది శ్మశాన వాటిక కానీ అదొక పెద్ద మల్టీ ప్లెక్స్ లాగా ఉంది. మైకులో నుంచి ఘంటశాల భగవద్గీత మృదు మధురంగా వినిపిస్తోంది. రకవారీ పూల మొక్కలు చక్కగా పెంచి ఉన్నారు. వేదాంత పూరిత వాక్యాలు గోడల నిండుగా రాయబడి ఉన్నాయి..................