మానవ సమాజ వికాసం
పురాతన మానవ నాగరికత పరిశోధకులు హోల్డర్నెస్ పండితుడు ఇలా చెప్పాడు: "భారత ఉపఖండంలోని దక్కను పీఠభూమి లేక ఇప్పటి తెలంగాణ; దాని చుట్టూ ఆవరించి ఉన్న భూభాగం: గంగా సింధూ మైదానం, హిమాలయ ప్రాంతాలకు భిన్నమైనది. దక్కను పీఠభూమి పాత గొండ్వాన లేక మూరియా అనబడే ఉపఖండంలోని భూభాగం ఆఫ్రికా వరకు వ్యాపించి ఆఫ్రికాతో కలిసి వుండేది. క్రీ.పూ. మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలు మొదట కలిసే వున్నాయి. ఆ కలిసి వున్న భూభాగాలన్ని ఇప్పుడు హిందూ మహాసముద్రం ఆక్రమించింది. ఈ భూభాగంలో తయారైన పర్వతాల గుట్టలు ప్రపంచంలో అన్నింటికన్నా పురాతనమైనవి. వాటిలో చాలా భాగం భూమి తయారయ్యే మూడవ పరిణామ దశలో మునిగిపోగా అక్కడ ప్రవహించిన లావా రాళ్ళుగా మారి ఇప్పటికి గుట్టలు గుట్టలుగా దక్కను పీఠభూమిలో ఉన్నాయి.”.
అలాగే ఇప్పుడున్న భారత ఉపఖండం దక్కను పీఠభూమి తప్ప మరేమికాదని, అది ఆఫ్రికాలో కలసి ఆఫ్రికా ఖండంగా ఉండేదని, ఇప్పుడున్న ఉత్తర భారతదేశం హిమాలయాలతో సహా సముద్రంలో ఉండేదని, కాల క్రమేణ ఆఫ్రికా ఖండంతో సంబంధించి ఉన్న దేశంపై హిందూ మహా సముద్రం చోటు చేసుకుని దక్కను పీఠభూమి ఒక ద్వీపములాగ ఉండి పోయిందని, ఇక్కడే పురాతన మానవుడు ఆవిర్భవించాడని పరిశోధకులు నిరూపిస్తున్నారు. తర్వాత కాలంలో దక్కను పీఠభూమి ద్వీపానికి ఉత్తరంగా నున్న చైనాకు దక్కను పీఠభూమికి మధ్య సముద్ర భాగంలో మెరక వేసి యిప్పటి భూమి 100 లక్షల సం॥రాల క్రితమే ఏర్పడింది. హిమాలయాలు ఉత్తర భారత ప్రాంతం అలా తయారయ్యాక దక్కను గోంద్వాన గడ్డమీద నర సంతతి, ఆదిమ మానవ నాగరికత ప్రపంచమంతా వ్యాపించిందని పై పండితులు దృఢంగా చెపుతున్నారు. బ్రిటీష్ జీవ శాస్త్రవేత్త థామస్ హక్సలే గత శతాబ్ధం చివర్లోను, ప్రముఖ చారిత్రకారుడు హెచ్.జి.వెల్స్, ఈ దశాబ్ధపు ప్రారంభంలోనూ, రష్యన్ భూవిజ్ఞాన వేత్త అలెగ్జాండర్ కొండ్రికోల్ అయిదు దశబ్దాల క్రిందట వేర్వేరు కాలాల్లో వివిధ పద్ధతులలో విశ్లేషణ చేసి మొట్ట మొదట మానవ నాగరికత తుంగభద్ర నదీ తీరంలో ఆవిర్భవించిందని నిర్ధారించారు. దక్కను పీఠభూమి రాతి యుగపు మానవునికి అత్యనుకూల ప్రదేశం జంబూ ద్వీపం................