మళ్లీ ఎందుకంటే..............
జమీల్యా ఇదివరకే తెలుగులో ఉంది కదా మళ్లీ ఎందుకని రెండోసారి చేయటం? అనే అనుమానం ఎవరికైనా సహజంగానే వస్తుంది. తెలుగులో వుప్పల లక్ష్మణరావుగారు చేసిన అనువాదం ఉండగా ఇంకోసారి అదే భాషలో చేయటం ఎందుకని నాకూ మొదట అనిపించింది. దానికి సమాధానం నాకు ఈ పని పురమాయించిన శేషు చెప్పాడు. "లక్ష్మణరావుగారి భాష నాకు కాస్త కష్టంగా అనిపించింది. ఇంతకు ముందంటే బాగానే అర్థం చేసుకోగలిగారేమో గానీ నాలాంటి వాళ్లకోసం కొంచం ఇప్పటి భాషలో మరోసారి చేయాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. నిజానికి ఆ భాష ఇచ్చే అనుభూతి మీకు నచ్చుతుందేమోగానీ నేను ఇబ్బంది పడ్డాను” అన్నాడు...................