• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Janabha Sankhya Apohalu

Janabha Sankhya Apohalu By S Y Qureshi

₹ 300

భారతదేశపు కుటుంబ నియంత్రణ కథ

భారతదేశ జనాభా 1951 సంవత్సరంలో 361.1 మిలియన్ల నుండి 2011 నాటికి 1.10.2 మిలియన్లకు పెరిగింది. 1 జూలై 2020 నాటికి, ఇది 1.38 బిలియన్లుగా ' అంచనా వేయబడింది. భారతదేశపు ప్రస్తుతం జనాభా పరివర్తన" యొక్క మూడవ దశలో ఉంది. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. అయితే 15-49 సంవత్సరాలలోపు పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు పెద్ద సంఖ్యలో (53 శాతం) ఉన్నందున జనాభా పెరుగుతూనే ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా వృద్ధి రేటులో కనిపిస్తున్న తగ్గుదల ధోరణిని భారత జనాభా లెక్కల సమాచార విశ్లేషణ నిర్ధారిస్తుంది. 1991-2001* కాలంలో 21.5 శాతం నుండి 2001-2011 సంవత్సరంలో దశాబ్ధ వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదైంది,

ఒకవైపు అన్ని మత సమూహాల మధ్య దశాబ్ధ వృద్ధి రేట్లు క్షీణిస్తుండగా, మరోవైపు - రాష్ట్రాలలో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి, మరియు మహిళల సాధికారత స్థాయిని బట్టి అంతర్రాష్ట్ర మరియు అంతర్ంత వైవిధ్యాలు కొనసాగుతున్నాయి. 1950లలో 6 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తం సంతానోత్పత్తి రేటు (ఒక స్త్రీ తన జీవితంలో పొందే సజీవ శిశు జననాల సగటు సంఖ్య) 2015-16 లో 2.2కి తగ్గడం గమనార్హం. జంటలు కూడా మునుపటి కంటే తక్కువ పిల్లలను కావాలి అని అనుకుని ఆచరిస్తునప్పటికీ, జనాభా పరివర్తన కారణంగా, జనాభా సంఖ్యలో మొత్తం పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తుంది. '

భారతదేశంలో అధిక సంఖ్యలో యువకులు (సుమారు 30 శాతం) ఉన్నారు. యుక్తవయస్కులు (10-19 సంవత్సరాలు) మరియు యువత (15-24 సంవత్సరాలు) - ఎవరైతే పునరుత్పత్తి వయస్సులో ఉన్నవారు లేదా కనీసం త్వరలో ఆ వయసుకు వచ్చేవారు ఉన్నారు. ఈ సమూహం తక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసినప్పటికీ, ఇప్పటికీ మొత్తం జననాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది. దీనికి కారణం................

  • Title :Janabha Sankhya Apohalu
  • Author :S Y Qureshi
  • Publisher :Vishalandra Publishing House
  • ISBN :MANIMN5015
  • Binding :Paerback
  • Published Date :Jan, 2024
  • Number Of Pages :290
  • Language :Telugu
  • Availability :instock