ఆకలీ ఆనందరావూ
విద్యుద్దీపాల క్రింద నిలచి వున్నాడు ఆనందరావు తెల్లనైన వెలుగుతో నిండిన నల్లనైన చీకట్లను చూస్తూ... అపశ్రుతి సంగీతాలకు లయవేస్తున్న నిశ్శబ్దాన్ని వింటూ... బజారు బీభత్సంలో బస్సుల రొదలో ప్రశాంతతను వెతుకుతూ...
విలువైన వలువల లోపల శిలలైన గుండెలుగల జనారణ్యంలో విలాసంగా నిలచివున్న నీకు తన ఉనికి చిరాకు కలిగించవచ్చనే భయంతో, తన మాసిపోయిన జీవితంలో పాతిక సంవత్సరాల దొంతర క్రింద నలిగి మాసిన పాత చిరునవ్వు శిథిలాలను చూపించి నిన్ను కానీ అడగడానికి వస్తున్న జీవచ్ఛవం, శతసహస్ర చ్ఛాయలతో క్షణక్షణం విస్తృతమౌతున్న సారవంతమైన శ్మశాన భూవాటి మధ్య నిలచివున్నాడు ఆనందరావు తన శరీరాన్ని స్వహస్తాలతో...............