అనువాదకుని నివేదన
డాక్టర్ బీరేంద్రకుమార్ భట్టాచార్య రచించిన "యారు ఇంగమ్" నవలను తెనిగించే అవకాశం నాకు దయచేసిన కేంద్ర సాహిత్య ఎకాడమీకి, గురువర్యులు కవిస త్తములు అధ్యక్షులు డాక్టర్ వినాయక కృష్ణగోకక్ మహోదయులకు, ఆ సంస్థ కార్యదర్శి, విమర్శక శిరోమణి ప్రొఫెసర్ ఇంద్రనాథ చౌదరి మహాశయులకు నా కృతజ్ఞ తా సహిత వందనాలు.
సజీవంగా ప్రాణంతో కళ్ళముందు కదిలే పాత్రలూ, సహజ మైన సన్ని వేశాలూ, ఆకర్షణీయమైన వాతావరణ చిత్రణ, చివరి దాకా ముందు ఏం జరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తించే కథా నిర్వహణ, ఈ నవలకు ప్రత్యేక ఆకర్షణలు.
భారత స్వాతంత్య్ర సిద్ధి కనుచూపుమేరలో వున్న తరు ణంలో 1945, 46 సంవత్సరాలలో జరిగిన సంఘటనలు ఈ నవలకు ఇతివృత్తం సంతరించాయి. నేతాజీ సుభాష్ చంద్రబోసు, మహాత్మాగాంధీ, దేశ విభజనకు పూర్వం చెల రేగిన కలహాలు, స్వరాజ్యస్వన్న సాఫల్యం ఈ కథావాహినిలో ప్రముఖ స్థానం వహించటంవల్ల సమకాలీన చరిత్రకు సాహిత్య గౌరవం సమకూరింది.
ఈ నవలను తెలుగు చేయటంలో నన్నయభట్టుకు నారా కుడి భుజంగా నిలిచి సకాలంలో అనువాదం యణభట్టు లాగా పూర్తిచేయటానికి ఎన లేని గణనీయమైన సహాయ సహకారాలు ఎంతో ప్రేమతో అందించిన సహృదయ మిత్రులు, బహు భాషా కోవిదులు, భారత భారతీ సమారాధకులు, విద్యా వైద్య.........