• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jannabhatla Kathalu 2nd part

Jannabhatla Kathalu 2nd part By Jannabhatla Narasimha Prasad

₹ 130

అదృష్టవంతుడు

బసవయ్య కొడుకు మార్కెట్లో కలిశాడు. పల్లెటూరులో పంటలు పండక కరువు వచ్చి అందరూ పట్నంవచ్చి బతుకుతున్నారట. తండ్రికి ఏదో చేసి నడవలేకపోతున్నాడు. నాలుగు నెలల నుంచి అన్నీ మంచంలోనే. మందులు వాడుతున్నారట అయినా జబ్బు తగ్గటం లేదు. మీరూ మా నాయన మంచి స్నేహితులట కదా, ఎప్పుడూ మీ గురించి చెబుతుంటాడు. ఇక్కడికి వచ్చిన కొత్తలో మిమ్ములను కలవటానికి చాలా ప్రయత్నించాడు. అడ్రస్ దొరక్క వీలుకాలేదు. ఇప్పుడు మిమ్ములను చూస్తే సంతోషిస్తాడు. ఒక్కసారి మా ఇంటికి రండిసార్ అని అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు.

మా ఊరి స్కూల్లో ఇద్దరం కలిసి చదువుకున్నాము. ఒకే బెంచిలో కూర్చునేవారము. చిరుతిండి ఏదైనా తెచ్చుకుంటే ఇద్దరం కలిసి తినేవారము. పదవ తరగతి పాస్ కాగానే ఇంటర్ చదవటానికి పట్నంలో కాలేజీలో చేరాను. ఆర్థిక పరిస్థితి బాగాలేక బసవయ్య చదువు మానేసి తండ్రికి తోడుగా వ్యవసాయంలోకి దిగాడు.

డిగ్రీ పాస్ కాగానే నాకు గవర్నమెంటు జాబ్ వచ్చింది. మంచి సంబంధం చూసి నాకు పెళ్ళి చేశారు మా వాళ్ళు. పట్నంలో సొంత ఇల్లు కట్టుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బాగా తెలివిగలవారు. స్కూల్లో ఎప్పుడూ చదువులో ఫస్ట్ ర్యాంకులు వచ్చేవి ఇద్దరికి.

నేను పట్నంలో స్థిరపడ్డా సంవత్సరానికి ఒక్కసారి అయినా మా సొంత ఊరు పోయి నా చిన్ననాటి స్నేహితులను కలిసి వస్తుండేవాడిని.

నీకేమి, మంచి ఉద్యోగం, సొంత ఇల్లు ఉంది. నీ పిల్లలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. అదృష్టవంతుడివి. మా పిల్లలు ఉన్నారు. చూడు వానాకాలం చదువులు. ఒక్కొక్క క్లాసు రెండు సంవత్సరాలు చదువుతున్నారు...................

  • Title :Jannabhatla Kathalu 2nd part
  • Author :Jannabhatla Narasimha Prasad
  • Publisher :Jannabhatla Narasimha Prasad
  • ISBN :MANIMN4397
  • Binding :Papar back
  • Published Date :July, 2015 firtst print
  • Number Of Pages :159
  • Language :Telugu
  • Availability :instock