• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jannabhatla Kathalu 3rd part

Jannabhatla Kathalu 3rd part By Jannabhatla Narasimha Prasad

₹ 100

జనాభట్ల కథలు-3

ఆపద్బాంధవుడు

ఆ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. దాదాపు అన్నికంపార్ట్మెంటులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అక్కడ ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉచితంగా అన్నప్రసాదాలు, చిన్న పిల్లలకు వేడిగా పాలు సరఫరా చేస్తూన్నది దేవాలయ పాలకవర్గ మండలి యంత్రాంగం.

కాలినడకన వచ్చిన వారు ప్రత్యేక కంపార్ట్మెంటులలో వేచి ఉన్నారు. వీరికి దైవ దర్శనంలో ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తారు. అక్కడ ఉన్న భక్తులలో భాస్కరరావు అతని భార్య రుక్మిణి కూడా ఉన్నారు. ఉదయం ఆరుగంటల నుంచి వేచి ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలు అయింది.

అప్పటి వరకు స్వామివారి దర్శనానికి పోతున్న భక్తులను ఆపివేశారు. "కారణం ఏమిటి" అని అక్కడ ఉన్న భక్తులు మాట్లాడుకొంటున్నారు.

"ఆ ఇంకేముంది వి.ఐ.పి బ్రేక్ దర్శనం అందుకే మన క్యూ ఆపేశారు. ఇక రెండు గంటలు ఇక్కడే కూర్చొని ఎదురుగా ఉన్న టి.వి చూస్తు కాలక్షేపం చెయ్యాల్సిందే" అని అన్నాడు ఒక భక్తుడు.

“నాకు తెలియక అడుగుతాను. ఈ వి.ఐ.పిలు అంటే ఎవరు" అని ఒక పల్లెటూరు నుంచి వచ్చిన భక్తుడు అడిగాడు.

" ఆ మాత్రం తెలియదానీకు. మంత్రులు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వారి ద్వారా సిఫారసు పత్రాలు తెచ్చుకొన్న వంది మాగధులు, పెద్ద కొలువుల్లో ఉన్న అధికారులు వారి అనుచరం వర్గం ఇంకా సినిమానటులు, సెలెబ్రటీలు ఇలా అబ్బో ఎంతో మంది ఉన్నారు వీరందరికీ స్పెషల్ దర్శనం ఇస్తారు" అని అన్నాడు పట్నం నుంచి వచ్చిన ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన భక్తుడు. "అయినా! నాకు తెలియక అడుగుతానండి భగవంతుని దగ్గర ఈ బేధభావాలు, పెద్ద చిన్న అనే తారతమ్యాలు ఏమిటండీ. ఆయన దృష్టిలో అందరూ సమానమే.......................

  • Title :Jannabhatla Kathalu 3rd part
  • Author :Jannabhatla Narasimha Prasad
  • Publisher :Jannabhatla Narasimha Prasad
  • ISBN :MANIMN4399
  • Binding :Papar back
  • Published Date :Oct, 2016
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock