• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jannabhatla Kathalu 4th part

Jannabhatla Kathalu 4th part By Jannabhatla Narasimha Prasad

₹ 120

అవేకళ్ళు

అవంతి రాజ్యాన్ని మాధవ వర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. తన రాజ్యంలోని ప్రజలందరికి కష్టనష్టాలు కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మ ప్రభువుగా పేరు సంపాదించుకొన్నాడు.

ఆ మహారాజుగారి భార్య పేరు ఆమరేశ్వరీదేవి. వారికి ఒక కొడుకు. ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు రవీంద్ర వర్మ. కూతురు పేరు వాసవదత్త. ఒక్కతే అమ్మాయి అందుకే గారాబంగా పెరుగుతున్నది.

యువరాజు రవీంద్రవర్మకు విద్యాబుద్ధులు నేర్పించటానికి విరూపాక్ష స్వామి గురుకులంలో చేర్పించారు. అక్కడ తనతో ఉన్న ఇతర విద్యార్ధులతో కలసి గురువు గారికి సేవచేస్తూ రాజుగారి కొడుకు ననే అహంకారం లేకుండా విద్య నేర్చుకోసాగాడు.

ఒకరోజు గురువుగారి నిత్యాగ్ని హోత్రానికి కావలసిన సమిధలకోసం తోటి విద్యార్ధులతో కలసి అడవికి పోయాడు. అందరూ తలా ఒక దిక్కుకు బయలు దేరారు.

రవీంద్రవర్మ ఒక్కడే చాలా దూరం పోయాడు. ఎంత ప్రయత్నించి వెతికినా సమిధలు దొరకలేదు. అప్పటికే కాలాతీతమై పోతున్నది. నిర్దేశించిన సమయానికి ఆశ్రమానికి తిరిగి చేరుకోపోతే గురువుగారు కష్టపడతారు. అందుకని తన ప్రయత్నాన్ని అపకుండా అన్వేషించ సాగాడు.

దూరంగా ఒక దట్టమైన పొద కనిపించింది రవీంద్రవర్మకు. దానిపైభాగాన సమిధలు కనిపించాయి. ఆ పొదను సమీపించి త్వరత్వరగా సమిధలు కొడవలితో కొయ్య సాగాడు.

దట్టంగా పెరిగి ఉన్న పొద క్రింద భాగములో ఒక వేట శునకము తన రెండు చిన్న పిల్లకూనలను ప్రక్కలో భద్రముగా పెట్టుకొని పడుకొని ఉన్నది. ఆ రెండు పసికూనలు ఒక దానిపై మరొకటి ఎక్కుతూ గున గున దొర్లుతూ పడుతు లేస్తూ తల్లి దగ్గర పాలు త్రాగుతున్నాయి

  • Title :Jannabhatla Kathalu 4th part
  • Author :Jannabhatla Narasimha Prasad
  • Publisher :Jannabhatla Narasimha Prasad
  • ISBN :MANIMN4400
  • Binding :Papar back
  • Published Date :May, 2018
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock