జంతుజాతిలో రూపవైవిధ్యం
వృక్షశాస్త్రం ఏ విధంగా చెట్టుచేమలను గురించి బోధించుతుందో ఆ విధంగా జంతుశాస్త్రం జంతువులను గురించి బోధించుతుంది.
శీతల ధ్రువ ప్రదేశాలనుండి అత్యధిక ఉష్ణమండలాలవరకూ, మహాసముద్రాల అగాధాలనుండి పర్వత శిఖరాలవరకూ, ప్రపంచమంతటా మనకు జంతువులు కనబడ తాయి. జంతువుల పరిసరాలు, అనగా ప్రకృతిసిద్ధంగా వాటి చుట్టూ వుండే పరిస్థితులలో ఎంత వైవిధ్యం వుంటుందో అలాగే వాటి ఆహారంలో కూడా అంత వైవిధ్యం వుంటుంది. అందుచేత జంతువులు జీవించే విధంలోనూ, వాటి శరీర నిర్మాణంలోనూ చాలా భేదం వుంటుంది.
ఉదాహరణకు : ఉత్తరధ్రువపు సముద్రతీరాలందూ, ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలుతూండే హిమరాసులపైనా ధ్రువపు ఎలుగుబంటి నివసిస్తూవుంటుంది. (చిత్రపటం) ఇది పెద్ద జంతువు. దీని ఒంటిమీద దట్టమైన తెల్లని బొచ్చు వుంటుంది. ఈ బొచ్చువల్ల దానికి చలినుండి చక్కని రక్షణ కలుగుతుంది. ఈ జంతువు తెల్లగా వుండడంచేత మంచుతో కప్పబడిన హిమప్రదేశంమీద పోల్చుకోవడమే ఎంతో కష్టమవుతుంది. ఈ ధ్రువపు ఎలుగుబంటి సీళ్లు అనే జంతువులను భక్షించుతుంది. సముద్రపు నీటినుండి సీళ్లు బయటికి వచ్చినప్పుడు వాటిని అది చంపుతుంది. అంతేకాదు. అది బాగా ఈదడమే కాకుండా నీటిలో మునిగిపోయి నీటి అడుగున కూడా బాగా ఈదగలదు. అందుచేత అది నీటి అడుగునే పొంచి వుండి సీళ్లు మంచుమీదకు రాగానే అకస్మాత్తుగా వాటిమీద పడి వాటిని చంపుతుంది.
ఎలుగుబంటి చిత్రపటం II) పరిసరాలూ, దాని ఆహారమూ పూర్తిగా వేరు. ఈ జంతువు దట్టమైన అరణ్యాల్లో నివసిస్తూ వుంటుంది. దాని బొచ్చు ఎరుపు, నలుపుగా ............................