శిల్పం కాలేని రాయి
శిల్పం కాలేని రాయి ఈ రాయిని వెతికి ఏ శిల్పీ
శిల్పం చెయ్యలేదు
ఈ రాయిని చదును చేసి ఏ మేస్త్రీ
మేడ ఎక్కేందుకు మెట్టుగా కట్టలేదు
ఈ రాయిని బోర్లించి ఏ తోటమాలీ
విశ్రాంతి బల్లగా మార్చలేదు
నాలుగు మూలలు చౌకం చేసి
ఈ రాయిని ఏ వడ్డెర కూలీ
భవనానికి పునాది రాయిగా
ఉపయోగించలేదు
వాహనాలు సాఫీగా, హాయిగా,
వేగంగా వెళ్ళే
రహదారి మీద అన్నివైపులా
మొనలు తేలి
అడ్డంగా పడి ఉన్న బండరాయి ఇది
కవిత పెరుతో చలామణి
అవుతున్న కంకర ఇది
ఎంతటి ప్రమాదానికైనా హేతువు
ఇది ప్రాణాలు తీసే తీతువు
కళాత్మకంగా కవితా శిల్పమైనా రావాలి
లేదా, సాంకేతిక ఉపయోగ
వ్యాసమైనా కావాలి.................