• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jashuva

Jashuva By Gurram Jashuva

₹ 600

  సాహిత్యంతో సమాజాన్ని ప్రభావితం చేసిన రచయితలు తెలుగునాట ఎందరో ఉన్నారు. అలాంటివారి సమగ్ర రచనలను ఒకే సంకలనంగా పాటకులకు అందుబాటులోకి తేవడం మనసు ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా గుర్రం జాషువా సర్వ లభ్య రచనల సంకలనము మనముందుకు తెచ్చారు.

  జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.

ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవిదిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాధ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్దుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

  • Title :Jashuva
  • Author :Gurram Jashuva
  • Publisher :Manasu Foundation
  • ISBN :EMESCO0562
  • Binding :Hard Binding
  • Published Date :November 2024 2nd print
  • Number Of Pages :1654
  • Language :Telugu
  • Availability :instock