జాతక చంద్రిక
జ్యోతిష ఉపోద్ఘాతము - వివిధ అంశములు మన ప్రాచీన విజ్ఞాన శాస్త్రాల్లో విశిష్టమైనది జ్యోతిష శాస్త్రం. ఈ శాస్త్రం మానవ జీవనంతో నిత్య సంబంధం కలిగి ఉంది. వేదాంగ శాస్త్రాల్లో ఈ జ్యోతిష శాస్త్రం మకుటాయ మానమైనది.
శ్లో॥ యధా శిఖా మయూరాణాం నాగానాం మణయోయధా ! తద్వేద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిషాం మూర్ధనిస్థితం !! నెమళ్ళకు ఫించమువలెను, పాములకు మణివలె, వేదాంగములలో ఒకటియైన ఈ జ్యోతిష శాస్త్రము మకుటాయమైనదని విశ్లేషించి చెప్పటం జరిగింది. అందుకే వేదపురుషునకు జ్యోతిషం చక్షువు వంటిదని భావించడం జరిగింది.
జ్యోతిషం కాల సూచికమైన శాస్త్రము. కర్మ స్వరూపాన్ని సూచించే శాస్త్రం. కాలకర్మల వల్ల కలిగే ఉత్పత్తి, స్థితి, లయలను ఈ జ్యోతిష శాస్త్రం నిర్ణయిస్తుంది.
ఈ శాస్త్రాన్ని అనేకమంది పరిశోధనలు చేసి, విశ్లేషించి అధ్యయనాలు చేయడం వలన 'మంచి ఫలితములను' పొందుతున్నాము.
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అలాగే సమస్త శాస్త్రములలో జ్యోతిషము కూడా నయనము వంటిదే. ఇది భూత భవిష్యత్, వర్తమానములను తెలియజేయు త్రికాల వేద జ్ఞాన శాస్త్రము. సూర్యుడు - బ్రహ్మ- వ్యాసుడు - వశిష్ఠుడు-శకల్యుడు-అత్రి పరాశరుడు- కశ్యప మహాముని - నారదమహర్షి - గర్గమహాముని - మరీచి - మనువు- అంగీరసుడు - రోమశుడు - పులహుడు - చ్యవన................