• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jayadev Cartoonlu

Jayadev Cartoonlu By Jayadev

₹ 100

క్రోక్విల్ కోయిల పాడింది

జయదేవ్ కార్టూన్ల గురించి తెలిసినంతగా ఆయన గురించి తెలుగువాళ్ళకి తెలీదు. తెలియాలనే రూలు గూడా రాజ్యాంగంలోని ఏ అధికరణంలో గూడా రాసిలేదు. అదివేరే సంగతి. కానీ చచ్చినట్టు తెలుసుకు తీరాల్సినంత విషయమూ ఉంది. ఇది ఉన్న సంగతి. ఎవరేనా ఎందుకేనా ఆరేళ్ళనుండి అరవయ్యేళ్ళ వరకూ అదేపనిగా ఒకే పనిచేసి చేసి ఇంకా చేస్తూ చేస్తూ ఉన్నారనుకోండి - మనం వెంటనే లెక్కవేస్తాం. లాభం ఎంత? బావుకున్నదెంత? కీర్తీ, డబ్బూ, దస్కం, సుఖాలూ, మందీ మార్బలం - అన్ని చూసి బ్రాటోవరు తెచ్చి కలిపి 'ఏం బుర్రగురూ జీనియస్' అని చప్పట్లు కొడతాం. కానీ అరవయ్యేళ్ళ అష్టకష్టాల తర్వాత ఎకౌంట్లో పైన చెప్పినవేవీ కనిపించలేదనుకోండి. బ్యాంక్ లాకర్ ఓపెన్చేస్తే కరెన్సీ కట్టలూ బంగారు గాజుల బదులు నలభై వేల నలుపు చేసిన తెల్లకాయితం ముక్కలు కింద పడ్డాయనుకోండి. అప్పుడేమంటాం. ఇదేదో కీల్పాక్ హాస్పిటల్ కేసు అని తెలిసిపోతుంది. ఎంత పిచ్చైనా అంత చిన్నతనంలోనే ఎలా పరిమళించిందని కించిత్ ఆశ్చర్యం వేస్తుంది. ఎంత పిచ్చైనా అరవయ్యేళ్ళ వరకూ ముదిరి చిలవలు, పలవలెలా వేసిందని జాలి కలిగిస్తుంది. పైన లాస్ అండ్ ప్రాఫిట్ అకౌంటింగ్కీ ఇప్పటి హాచ్చర్యానికీ మధ్య చిన్న కథ - ఇది జయదేవ్ కథకాదు. మా తెలుగు కార్టూనిస్టులందరి సినిమా కథ. మధ్యమధ్య కనిపించే కామెడీట్రాక్ ఎలా ఉన్నా చివరాఖరికి వచ్చే చచ్చే ట్రాజెడీ మాత్రం ప్రేక్షకుల కంట బావురుమని తడిపెట్టిస్తుంది. పిక్చర్ "భశుం" అని ముందే గారంటీ ఇవ్వగలం.

కేరళలోగానీ, తమిళనాడులోగానీ ఇండియాలో మరెక్కడైనా కార్టూనిస్టులు లోవర్ మిడిల్ క్లాస్ నుంచే వస్తారు. కాస్త పైక్లాస్, ఇంకాస్త హైక్లాస్ తల్లిదండ్రులంతా బిడ్డలు దినదిన ప్రవర్ధమానమై చివ్వరికి ఏమవ్వాలో ముందుకు ముందే నిర్ణయం చేసేస్తారు. పొలిటీషియన్ల కొడుకులు, సినిమా హీరోల డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల కొడుకుల కొడుకుల కొడుకులు, పత్రికల బాస్ల పిల్లలు, సిమెంట్ కంపెనీల, టెక్స్టైల్, స్టీల్, చిట్ఫండ్ - ఏ కొడుకైనా సరే ఎన్నడైనా సరే కార్టూనిస్ట్ అవడం ఎప్పుడైనా చూశారా? ఎందుకని అడగడానికి లేదు. అదంతే. వాళ్ళలా అవ్వాలని భగవంతుడూ డబ్బుగారూ కలిసి నొసటమీద రాస్తారు. అచ్చం అలాగే వాళ్ళు చచ్చి నట్లుగా అవుతారు. ఎమ్జీలుగా, సి.ఇ.ఓలుగా వర్థిల్లుతారు.

మిగతా లోక్లాస్ తల్లిదండ్రుల బిడ్డలు (చిల్డ్రన్ ఆఫ్ వెరీవెరీ లెస్సర్ గాడ్స్) అరాకొరా చదివి చదవకా, ఫీజులు కట్టకట్టకా, టెన్త్, ఇంటర్, మహా అయితే డిగ్రీ మిడికీ మిడక్కా బయటపడతారు....................

  • Title :Jayadev Cartoonlu
  • Author :Jayadev
  • Publisher :Media House Publications
  • ISBN :MANIMN5848
  • Binding :Paerback
  • Published Date :Aug, 2022
  • Number Of Pages :238
  • Language :Telugu
  • Availability :instock