• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jayamohan Adholokam

Jayamohan Adholokam By Kumar S

₹ 350

రచయిత ముందుమాట

ఒకసారి తిరువణ్ణామలైలో ఒక సభలో మాట్లాడుతూ నేను ఈ ఉళ్ళో భిక్షాటన చేశానని చెప్పాను. నా స్నేహితులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. నన్ను బిచ్చగాడిగా అసలు ఊహించుకోలేకపోయారు. 'బిచ్చగాళ్ళను మనమెవ్వరం పట్టించుకోము, తోచింది ఇచ్చి అక్కణ్ణుండి వీలైనంత త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. కొంచం ఆగి గమనించండి, వారిది ఎంత పెద్ద ప్రపంచమో మీకు తెలుస్తుంది. తిరువణ్ణామలై జనాభాలో అధిక శాతం భిక్షగాళ్ళే!' అంటూ నేను ముక్తాయించాను.

1981లో నేను సన్యాసి కావాలన్న ఉద్దేశ్యంతో ఇల్లు వదిలి కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాను. కానీ రెండు వారాల్లో మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. అప్పుడే నేను భిక్షాటన చేసే సన్యాసిగా తిరువణ్ణామలై, పళని పట్టణాల్లో బిచ్చగాళ్ళ మధ్యలో నేనూ ఒక భిక్షగాడిగా కొంత కాలం గడిపాను. ఆ అనుభవాల్లోంచి రాసినదే 'ఏళాం ఉలగం' అనే ఈ నవల. ఇప్పుడు అధోలోకంగా తెలుగులో మీ చేతికొచ్చింది.

 

2003లో నేను కాడు (అడవి) అనే నవల రాశాను. దీన్ని తమిళంలో గేయ లక్షణం గల నవలగా పరిగణిస్తారు. ప్రతి రోజూ ఉదయాన పసిడి కాంతులతో వెలుతురు మన అందరి జీవితాల్లోనూ ప్రసరించి తర్వాత అదృశ్యం అయిపోతుంది. - ఆ వెలుగును గురించి రాసిన నవలే 'కాడు రాస్తున్న సమయంలో నేనొకరోజు ఆఫీస్కి బస్సులో వెళుతుండగా దారిలో నాలో ఏదో ఒక తెలీని అనుభూతి కలిగింది. నా అంతః చేతనావస్థలో ఏదో జాగృతమైంది. ఆలోచనలు పుట్టుకొచ్చాయి, అవి వేళ్ళూని విస్తరించాయి. పళనిలో బిచ్చగాళ్ళతో గడిపిన రోజులు మళ్ళీ జ్ఞప్తికి వచ్చాయి...............

  • Title :Jayamohan Adholokam
  • Author :Kumar S
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN6164
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :267
  • Language :Telugu
  • Availability :instock