జ్ఞానం వేరు - నైపుణ్యం వేరు
ఈనాటి పాఠశాలల్లో బోధించబడుతున్న పాఠాలన్నీ ఆయా సబ్జెక్టులకు సంబంధించినవి మాత్రమే. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ... ఇలా ఉన్నాయి. కానీ ఈ బోధింపబడ్డ సబ్జెక్టులను సరైన పద్ధతిలో, సక్రమంగా, సద్వినియోగం చేసుకునే ప్రక్రియలే విద్యలోని జీవన నైపుణ్యాలు. నేటి యువత ఆ నైపుణ్యాలు సాధన చేయాలి.
జ్ఞానానికి, నైపుణ్యానికి మధ్య చాలా తేడా ఉంది. ఒకసారి ఐన్స్టీన్ మహాశయుడిని, ప్రిన్స్టన్ యూనివర్శిటీలో ఒక విద్యార్థి ఇదే ప్రశ్న అడిగాడట. దానికి ఆయన “టమేటో అనేది పండు అని మనకు తెలుసు, అది జ్ఞానం. అయితే ఆ పండుని మనం ఫ్రూట్ సలాడ్లో వాడకపోవడం అనేది నైపుణ్యం, అదే వివేకం" అని చమత్కారంగా చెప్పాడు.
ఈ కాలంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కానీ నైపుణ్యాలు తగినంతగా లేవు. నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, జీవితానికి అవసరమైన ఈ జీవన నైపుణ్యాలను బోధించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు 'జీవన నైపుణ్యాల' (Life Skills) అవసరాన్ని గుర్తించి, తగిన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించడం జరిగింది.
| నైపుణ్యాలు ప్రభావం ఏమిటి?
'గురువు లేని విద్య గుడ్డివిద్య' అన్నట్లుగా నైపుణ్యాలు లేని విద్య నిరుపయోగ మవుతుంది. చదువుకున్న డిగ్రీలకు విలువ తగ్గిపోతుంది. అదే చదువుతోపాటు ఏదో ఒక ప్రక్రియలో నిపుణుడిగా తీర్చిదిద్దితే ఆ విద్యార్థి అద్భుతాలు సాధించగలుగుతాడు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాత్రమే ఆ శిక్షణను సక్రమంగా, సరియైన పద్ధతిలో అందించ గలుగుతారు.
జీవన నైపుణ్యాలలో ముఖ్యంగా భాషానైపుణ్యం, వాక్చాతుర్యం, సాహిత్యం, వృత్తి, వ్యాపారం, కళ, క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలు వంటివి అనేకం ఉన్నాయి. ఇవి సాధన చేసి ఆయా రంగాలలో నిష్ణాతులైనవారు ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. దానివలన చక్కని మానవ సంబంధాలు పెంపొందించుకుని, సరైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో చక్కని సర్దుబాటు చేసుకోగలుగుతారు. గతంలో ఇటువంటి నైపుణ్యాలు తండ్రులు, తాతలు,.........................