• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jeevana Sandya

Jeevana Sandya By Ravulapalli Suneeta

₹ 200

వృద్ధులకు విశ్వాస సూర్యోదయం - సునీత

"పొద్దు పడమటి దిక్కుకు వాలి చాలా సేపయింది. పగలంతా యవ్వనంతో ధగధగలాడి దడదడలాడించిన సూర్యుడు పొద్దుగుంకుతూనే శక్తులుడిగినట్లు వెలవెలబోతాడు... (అయితే) పడమటి కొండల్లోకి జారిపోతున్న సూర్యుడితో” వృద్ధులు తమను తాము పోల్చుకుంటూ ఉంటారనీ, ఎందుకంటే "సూర్యుడు అస్తమించినంతసేపూ, తమకు బరువేనని అనుకునేవాళ్ళు సూర్యుడికి లేరు, కాని తమకు మాత్రం ఉన్నార”ని వృద్ధులు అనుకుంటారనీ, ఆ నిరాశను వారి దరికి చేరనివ్వకుండా కాపాడుకోవలసిన బాధ్యత కుటుంబీకులదని ప్రసిద్ధ రచయిత్రి రావులపల్లి సునీత నీతివాక్యం. నవలా రచయితగానే గాక, కవిగా కూడా స్థిరపడిన సునీత కలం నుంచి వెలువడిన ఈ "జీవనసంధ్య” నవల ఆసాంతం మన కుటుంబాలలో వృద్ధులు రకరకాల కారణాలవల్ల కోల్పోతున్న శాంతిని గురించి, వృద్ధాప్యంలో వారికి కుటుంబ సభ్యులు సదావగాహనతో ప్రసాదించవలసిన ప్రశాంతి గురించీ చర్చించింది.

సునీత ఒక విద్యావంతురాలుగా వృద్ధులపట్ల ఎంత ఆర్ద్రతతో, వారి సమస్యలపట్ల మరెంతటి లోతైన పరిశీలనతో స్పందించారో ఈ నవల చదివితే మనకు అర్ధమవుతుంది. కుటుంబాలలో స్పర్ధలు ఎవరి నుంచి ప్రారంభమైనా, సర్దుబాటు ధోరణివల్ల సమస్యల్ని పెంచుకోకుండా ఎలా తుంచుకోవచ్చో సునీత..................

  • Title :Jeevana Sandya
  • Author :Ravulapalli Suneeta
  • Publisher :Pracchaaya
  • ISBN :MANIMN6447
  • Binding :Papar Back
  • Published Date :Aug, 2025
  • Number Of Pages :137
  • Language :Telugu
  • Availability :instock