వేలు పట్టి నడిపించే ఆత్మీయ నది
అమ్మ రాసి... 'కథ' పుస్తకంగా వస్తోంది. నువ్వు ముందుమాట రాయాలి అన్నాడు రవి ప్రకాష్! అమ్మ అంటే రవి ప్రకాష్ కే కాదు, నాక్కూడా! అమ్మ పేరు మాణిక్యాంంబ. తను నడిచిన దారుల్లో తటస్థ పడిన నిజ జీవిత ఘటనల సమాహారం... ఈ కథ! ఆ కాలపు చరిత్రని రికార్డు చేసిన 'అమ్మ' కథలో కన్నీళ్లున్నాయి. కష్టాలున్నాయి. నిష్టూరాలకీ కొదవ లేదు. ఐనా, జీవితం పైన మొక్కవోని విశ్వాసంతో సస్థైర్యంగా, దృఢచిత్తంతో అడుగులేసిన ధీశాలి... 'అమ్మ!
ఆనాటి బ్రాహ్మణ కుటుంబాలలోని ఆచార వ్యవహారాల్ని, ఆడపిల్లల దీన స్థితిని గురజాడ తన 'కన్యాశుల్కం' నాటకంలో ఎలా కళ్ళక్కట్టినట్టు రాశాడో 'అమ్మ' మాణిక్యాంబ కూడా అంతే సమర్ధంగా తన జీవితాన్ని చిత్రించింది. ఇదొక కాలపు కథ మాత్రమే కాదు. చరిత్ర కూడా! ఆ కాలపు జీవన స్థితి గతులని యధాతధంగా తన కథలో మిళితం చేసిన తీరు మనల్ని అబ్బుర పరుస్తుంది. టాల్స్టాయ్ రచనల్లోని అద్భుత స్త్రీ పాత్రలకు ఏ మాత్రం తీసిపోదు 'అమ్మ' వ్యక్తిత్వం! దృఢ సంకల్పం, మనోస్థైర్యాలే... అమ్మకి.................