సానెన్: 28 జులై 1964
సమస్తమైన జీవితాన్ని ఒక్కటిగా చేసే - ఏకీకృతం చేసే విషయం గురించి నేను మాట్లాడదలచుకున్నాను. తునాతునకలు చేయకుండా సంపూర్ణ మానవ అస్తిత్వాన్ని చూడగలిగే దృక్పథం ఇది. దాని గురించి నేను మాట్లాడదలచు కున్నాను. దీనిలోనికి కొంచెము లోతుగా పోవాలంటే ఎవరైనా సరే సిద్ధాంతాలు, నమ్మకాలు, మూర్ఖత్వాలలో చిక్కుకొని ఉండకూడదని నాకు అనిపిస్తుంది. మనలో చాలా మంది మనస్సుని నేలను దున్నినట్లు ఆపడం అనేది లేకుండా దున్నుతూనే ఉంటాం, కాని యెప్పటికి విత్తనాలను నాటము. విశ్లేషిస్తాము, విచారిస్తాము, విషయాలను చింపి చాటంత చేస్తాము, కాని మనము సంపూర్ణ జీవిత కదలికను అర్థము చేసుకోము.
ఇప్పుడు సంపూర్ణ జీవిత కదలికని అవగాహన చేసుకోవాలంటే తప్పకుండ మూడు విషయాలని చాలా లోతుగా అర్థము చేసుకోవాలి. అవి, కాలము, దుః ఖము, మరణము. కాలాన్ని అర్థము చేసుకోవటానికి - అది అంతా జరగటానికి ప్రేమ స్పష్టతని అడుగుతుంది. ప్రేమ సిద్ధాంతము కాదు లేదా అది ఆదర్శము కాదు. మీరు ప్రేమిస్తే ప్రేమిస్తారు లేదా మీరు ప్రేమించకపోతే ప్రేమించరు. ప్రేమని నేర్పించలేరు. మీరు ప్రేమలో పాఠాలను తీసుకోలేరు లేదా ప్రేమ యేమిటో తెలుసుకొనేందుకు మీరు రోజు వారి సాధన చేయటానికి ఒక పద్ధతి లేదు. కాని యెప్పుడైతే కాలాన్ని, దుఃఖపు అసాధారణమైన లోతుని, మరణముతో వచ్చే స్వచ్ఛతని నిజముగా అర్థము చేసుకుంటారో అప్పుడు వారు సహజముగా, తేలికగా వెనువెంటనే ప్రేమలో నిండిపోతారని అనుకుంటాను. అప్పుడు బహుశా.....................