జీవిత రహస్యాలు
జీవించే కళ
జీవితం చిన్నది, శక్తి పరిమితమైనది, చాలా పరిమితమైనది. ఇంత పరిమితమైన శక్తితో మనం అపరిమితమైనదాన్ని చేయాలి. ఈ చిన్న జీవితం ద్వారా మనం అలౌకిక ప్రపంచాన్ని చేరుకోవాలి. పెద్ద లక్ష్యం, గొప్ప సవాలు! అందుకే దయచేసి అనవరమైన విషయాలపై దృష్టి ఉంచకండి..
ఏది ప్రధానం? ఏది అప్రధానం? జ్ఞానులందరి నిర్వచనం ఒక్కటే - "మృత్యువు తనతో తీసుకెళ్ళగలిగేవన్నీ ప్రాధాన్యత లేనివే! మృత్యువు కూడా మీ నుండి వేరుచేయలేనిది ప్రధానమైనది”. ఈ నిర్వచనాన్ని గుర్తుంచుకోండి. ఈ నిర్వచనమే గీటురాయి కానివ్వండి. ఈ గీటురాయి ప్రమాణంగా మీరు దేన్నయినా వెంటనే అర్థం చేసుకోగలరు.
బంగారాన్ని నిర్ధారించే గీటురాయిని చూశారా? అలాగే ఈ నిర్వచనాన్ని, ఏదైతే ప్రధానమో, దానికి గీటురాయిగా ఉండనివ్వండి. మృత్యువు దీన్ని మీ నుండి దూరం చేస్తుందా? అయితే దీనికి ఏ ప్రాధాన్యతా లేదు. డబ్బుకు ప్రాధాన్యత లేదు. డబ్బుకు ఉపయోగం వుంది. డబ్బే ప్రధానం కాదు. హోదా, కీర్తి, అధికారం... వీటన్నింటినీ మృత్యువు ఒక్క వేటుతో తుడిచివేస్తుంది. ఎందుకు వాటి గురించి మీరిక్కడ వుండే కొన్నిరోజుల్లో అంత గందరగోళాన్ని సృష్టిస్తారు? ఇది ఒక అనంతమైన ప్రయాణం. అందులో మనం ఇక్కడ ఒక రాత్రి బసచేశాం. ఉదయమే వెళ్ళిపోతాం.
గుర్తుంచుకోండి. మీరు మీ శరీరాన్ని వదిలి వెళ్ళేప్పుడు దేన్నయితే మీతోపాటు తీసుకెళ్ళగలరో అదే ప్రధానమైనది. అంటే, ధ్యానం తప్ప మిగిలిన వ్యర్థమే. చైతన్యం తప్ప అంతా అప్రధానమైనది. ఎందుకంటే.............