• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jeevitam Anchuna. . . . . . . .

Jeevitam Anchuna. . . . . . . . By Jhansi Koppisetti

₹ 180

అందమైన పూలతోట - ముళ్ళతోనే బాధ!

శ్రీమతి ఝాన్సీగారు కథకురాలుగా, నవలా రచయిత్రిగా, కవయిత్రిగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితురాలు. పాఠకుల ఆదరణని విశేషంగా పొందిన ఉత్తమ సాహితీ విదుషీమణి. రచనలో తనదైన భావభావనలతో, అభివ్యక్తీకరణ గుణవిశేషాలతో ఒక ప్రత్యేకముద్రను సంతరించుకున్న రచయిత్రి.

ఈ 'జీవితం అంచున... Second Innings' అనేది ఝాన్సీగారి ఆత్మకథనాత్మక నవల లేక నవలాత్మక ఆత్మకథ అనుకోవచ్చు. నిజానికి ఎవరి ఆత్మకథ అయినా ఒక నవలే. కారణం ఆ వ్యక్తి జీవిత ప్రస్థానంలోని కాలం, ఆ కాలంలోని సమాజం, ఆ సమాజంలోని మనుషులతో ఆ వ్యక్తి సంబంధ, సంఘర్షణలూ ఆత్మకథలో ప్రతిబింబిస్తాయి. అలాగే, ఆ వ్యక్తి నడిచిన, నడుస్తున్న ప్రదేశాల నేపథ్యం / వాతావరణం, విలక్షణతలూ కూడా ఆ రచనలో ప్రతిఫలిస్తాయి. వీటన్నిటి మధ్యనా కేంద్రంగా ఆ వ్యక్తి మనోధర్మం, చిత్తవృత్తి, ప్రవర్తనారీతీ, మనస్తత్వ వైరుధ్యాలు కూడా పాఠకులకు అందుతాయి. కనుక, ఈ పుస్తకాన్ని మనం నవలగానే భావించవచ్చు. నేను అలా చదివే ఆనందించాను.

నవలలో 'జానూ' అనే ప్రధానపాత్ర ఉత్తమ పురుషలో చెప్పిన కథనం ఏకబిగిన చదివించే గుణంతో సాగింది.

వైద్యవృత్తే పరమావధిగా పెరుగుతూ వచ్చిన జానూ అరవయ్యో యేట అసిస్టెంట్ నర్సింగ్ విద్యార్థిగా చదువు సాగించటంతో కథ మొదలవుతుంది.

ఆస్ట్రేలియాలో నర్సింగ్ కాలేజీ, చదువు, వాతావరణం, దేశదేశాల సహవిద్యార్థినీ విద్యార్థులు, తల్లి సంరక్షణకు తాను ఏర్పాటు చేసిన మనుషులు, ఆ తల్లి అసాధారణ ప్రవర్తన, ఇలా... నవలలో జానూ ఎక్కడికక్కడ ప్రతి అంశాన్ని గురించీ సవిస్తరంగా వివరాల్ని చెబుతుంది.

ఇన్ని ఇక్కట్ల మధ్యనా ఆమె తన ప్రవృత్తిమార్గం సాహిత్యారాధన, రచనా వ్యాసంగం మానలేదు. ఒక దీర్ఘకవిత, కథాసంపుటి పూర్తి చేసి వాటి ఆవిష్కరణకు హైదరాబాద్ వెళుతుంది. ఆ తరువాత రవీంద్రభారతిలో భారీ ఎత్తున జరిగిన కార్యక్రమం నవలలో ఒక అత్యంత ప్రధానమైన మలుపు............

  • Title :Jeevitam Anchuna. . . . . . . .
  • Author :Jhansi Koppisetti
  • Publisher :Nagamani Publications
  • ISBN :MANIMN6458
  • Binding :Papar back
  • Published Date :Aug, 2025
  • Number Of Pages :213
  • Language :Telugu
  • Availability :instock