• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Jeevitame Oka Pustakam

Jeevitame Oka Pustakam By Jiddu Krishnamurty

₹ 495

మాటల శబ్దానికి అతీతంగా

వినడం అనే కళ అంత సులభంగా వొంటబట్టదు. కానీ దానిలో ఒక సౌందర్యం వున్నది. గొప్ప అవగాహన ఉన్నది. మనలోని రక రకాల లోతుల్లోంచి మనం వింటాం, కానీ మనం వినడం అనేది ఎల్లప్పుడూ ముందే సిద్దం చేసుకున్న ఒక భావన లేదా ఒక నిర్దిష్టమైన దృక్పథం నుండి జరుగుతున్నది. మనం సరళంగా వినలేం; ఎల్లప్పుడూ మన ఆలోచనలు, నిర్ణయాలు అలాగే పక్షపాత ధోరణులు అడ్డుకునే తెరలాగా ఉంటాయి...

వినడానికి తప్పనిసరిగా అంతరంగిక (అంతర్గత) నిశ్శబ్దం ఉండాలి. కూడబెట్టుకోవాలనే ఒత్తిడి నుండి స్వేచ్ఛ ఉండాలి, అవరోధం లేని సావధానత ఉండాలి. ఇలా జాగరూకతతో ఉంటూనే అనాసక్త స్థితిలో ఉండడమనేది మాటలకు ఆవలగా ఉన్నదానిని వినగలుగుతుంది. పదాలు గందరగోళ పరుస్తాయి; అవి కేవలం బాహ్యమైన సమాచార సాధనాలు మాత్రమే; కానీ మాటల చప్పుడుకు ఆవలగా ఉన్నదానితో సన్నిహిత స్పర్శ ఏర్పడాలంటే అనాసక్త అప్రమత్తత ఉండాలి. ప్రేమ ఉన్నవారు వినగలరేమో కానీ ఒక శ్రోత దొరకడం అత్యంత అరుదైన విషయం. మనలో చాలా మంది ఫలితాల వెంట లక్ష్య సాధన వెంటపడతాం. మనం ఎప్పుడూ ఒకరిని దాటిపోవడంలో, జయించడంలో మునిగిపోయి ఉంటాం. అందుచేత వినడం అనేది లేదు. కేవలం అలా వినడంలోనే ఎవరైనా మాటలలో ఉన్న పాటను నిజంగా వినగలుగుతారు.....................

  • Title :Jeevitame Oka Pustakam
  • Author :Jiddu Krishnamurty
  • Publisher :Krishnamurty Foundation India
  • ISBN :MANIMN6198
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :412
  • Language :Telugu
  • Availability :instock