ఝూన్సీ గలే కీ ఫాంసీ
నేను గతంలో ఎప్పుడూ ఇలా ముందుమాట రాయడం జరగలేదు. అయితే మా బావ ప్రతీ రచన తప్పనిసరిగా చదువుతా... తనదంటూ ఒక విశిష్టశైలి గల వ్యక్తి... ఒక రకమైన చమక్కు కనిపిస్తుంది ఏది రాసినా...
అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజాగుణాః
దాత్రుత్వం ప్రియవకృత్వం కవిత్వముచితజ్ఞతా!
అయితే ప్రయత్నించో లేక సందర్భానుసారంగానో దానం, ప్రియభాషణం కుదరవచ్చు గానీ కవిత్వం, ఉచితానుచితజ్ఞానం ఇవి ఖచ్చితంగా సహజగుణాలే... అనుకరించో, ప్రయత్నించో కుదిరేవి కావు... అటువంటి సహజగుణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి.
ఈ పుస్తక రచయితతోనే కాక పుస్తకంతో కూడా చాలా దగ్గర సంబంధం ఉండటం వలన నేను ముందుమాట రాయడానికి ఉద్యమించా..
పుస్తక రచయితకి నేను బావమరిదిని... మేము ఇద్దరం మేనత్త, మేనమామ పిల్లలం... మా జనరేషన్లో మగసంతానంలో పెద్ద...
మా పెద్దక్కని పెళ్ళాడి ప్రేమించి (ప్రేమిస్తూ) బావ అయ్యాడు...
నేను గత 33 సంవత్సరాలుగా ఝూన్సీలో ఉద్యోగరీత్యా ఉంటున్నాను. ఉద్యోగం మా సత్యంబాబయ్య వేయిస్తే, మా అక్క, పెద్దబావ (ఈ పుస్తక రచయిత) 1989 అక్టోబర్లో నన్ను ఝాన్సీ తీసుకు వచ్చి వదలడం జరిగింది.
ఇక్కడ వాళ్ళు వేళాకోళంగా అంటూ ఉంటారు 'ఝూన్సీ గలే కీ ఫాంసీ" అని... .................