• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jwalashikha Vishwamohan

Jwalashikha Vishwamohan By Vishwamohan Reddy

₹ 200

ముందుమాట
 

శ్రామిక ప్రజానాయకుడు

విశ్వమోహన్!

విశ్వమోహన్ తెలుగు సాహిత్యలోకంలో విలక్షణమైన, ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల రచయిత. దాదాపు 20 నవలలు, రెండు నాటకాలు రాశారు. ఆవగింజంత సాహితీకృషికి తాటికాయంత కీర్తిని ఆశించే రచయితలు ఉన్న ఈ రోజుల్లో విశ్వమోహన రెడ్డి తాను ఒక విలక్షణమైన రచయిత అయినప్పటికీ ప్రజాఉద్యమ కార్యకర్తగా జీవించారు. సినిమారంగం ద్వారా కీర్తిప్రతిష్టలతో పాటు ధనార్జనకు కూడా అవకాశాలు వాటికవిగా వెతుక్కుంటూ వచ్చినా ఆయన బడుగుజీవులతో కలిసి మెలిసి జీవించడమే ప్రాణవాయువుగా బతికారు.

తన జీవితపు చివరి పది సంవత్సరాలు రచనలు చేయటానికి తీరుబాటు లేనంతగా ప్రజాఉద్యమ కార్యకలాపాలలో ఆయన మునిగి తేలారు. పాలకుల కన్నెర్రకు గురై 25 సంవత్సరాల క్రితం 11-4-2000న పోలీసుల చేతుల్లో 50 ఏళ్ళ వయసులో బూటకపు ఎదురు కాల్పులలో అమరులయ్యారు.

పాలక పెద్దల ఇళ్లల్లోలాగా ఆయన ఇంట్లో బాంబులేమీ పేలలేదు. కానీ బడుగు ప్రజలను తమ జీవన సమస్యలపై ఉద్యమింపచేశారు. ఆయన ఇంట కుటుంబసభ్యుల హత్యలు జరగలేదు. లక్షలు కోట్ల ధనరాశులు దొరకలేదు. కానీ సంఘం పెట్టుకునే హక్కు నుండి చట్టబద్ధ వేతనాల సాధనదాకా, ఇళ్లస్థలాల నిర్మాణం నుండి భూమి కౌలు సమస్యల దాకా శ్రమజీవులను ఐకమత్యంగా సంఘటిత పరిచి పోరాటాలు నిర్వహించారు...................

  • Title :Jwalashikha Vishwamohan
  • Author :Vishwamohan Reddy
  • Publisher :Jana Sahity Prachurana
  • ISBN :MANIMN6564
  • Binding :Papar back
  • Published Date :April, 2025
  • Number Of Pages :189
  • Language :Telugu
  • Availability :instock