ముందు మాట...
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్! అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే!
శాస్త్రం మాత్రేణ రక్షిత: ఈ శాస్త్రం మీరు ఎటువంటి సమస్యలతో ఉన్నా తల్లిలా రక్షిస్తుంది. జ్యోతిష్యం మూఢ నమ్మకం కాదు. ఈ అమాయకత్వం వదలి వాస్తవానికి రావాలి. ప్రస్తుత సమాజంలో ప్రజలు నూటికి 95 శాతం పద్ధతిగా ఆలోచించలేక పోతున్నారు. ఇలా ఐతే బాగుండును. వాలి అని కోరుకోవడం మంచిదే. కానీ అందుకు కావలసిన ప్రాథమిక ప్రయత్నం మరియు పరిష్కారములు చేయకుండా ఆశించటం ఉచితం కాదు. దేవనింద, గురునింద చేయటం మంచిది కాదు. ఈ శాస్త్రం ఋగ్వేదము నుండి గ్రహించబడినది. ప్రతి సమస్యకు పరిహారం యున్నది. శాస్త్ర సంబధమైన మార్గం అనుసరించి ప్రతి ఒక్కరూ సత్ఫలితాలను పొందవచ్చును. నవయువతకు మానసిక రుగ్మతలు అడ్డంకిగా యున్నది. మానసికి ధైర్యం కలుగుజేయుటకు తమపై తమకు నమ్మకం (confidence) కలుగుటకు ప్రథమంగా ప్రయత్నించాలి. అందుకు తగిన పరిహారములు యువతకు తెలియజేసే సంకల్పమే ఈ ప్రయత్నం. IT IS A PSYCHOLOGICAL TREATMENT THROUGH ASTROLOGY గురువుగారు చెప్పింది జరగాలి అని ఆశించటం సబబేగాని వారు చెప్పింది జరగటానికి, మీ జాతకంలో గ్రహదోష పరిహారములు చేసుకోవటం ద్వారా గురువుగారి మాటకు బలం చేకూర్చటం చాలా ముఖ్యం. అట్టి గ్రహశాంతులు అనంతరం శుభ ఫలములు సంభవము. అశిద్దం సాధ్యయేత్కార్యం, నవగ్రహ భయాపహం!
దుస్వన్న నాశనం చైవ సుస్వప్న ఫలదాయకం!
సిద్ధించని కార్యములు సిద్ధించును. నవగ్రహ భయమును పోగొట్టును. దుస్వప్నములను పోగొట్టును. మంచి స్వప్నములు వచ్చును. చెడు పోవును. మంచి జరుగును. మంచి స్వప్నములను ఫలవంతమగును జ్యోతిష్య వివరాలేగాక పరిహరములు కూడా వివరించుట జరిగినది. ఆధునిక యువతీయువకులు పరిహారము ఆచరించుట ద్వారా మీ జీవన సాఫల్యాన్ని ఆస్వాదించండి. మీ అభివృద్ధికి బాటలు వేసుకోగలరు. జోతిష్య విజ్ఞానం మహాసముద్రం. ఆ మహా శాస్త్రాన్ని పుక్కిటపట్టేవారు పట్టగలిగిన వారు చెప్పే జోశ్యాలే ఖచ్చితం కావటానికి అవకాశమున్నది. సత్య ప్రామాణికమైన శాస్త్రమే శాశ్వతమై సర్వకాలముయందును నిలిచి యుండగలదు. అట్టి శాస్త్రము ప్రాముఖ్యత సామాన్యమానవులకు అర్థమయ్యేలా వివరించటం మా ప్రయత్నం. జ్యోతిష్యం అక్షయపాత్ర.