• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili

K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili By K N Y Patanjali

₹ 120

రాజుగోరు

మధ్యాహ్నం నాలుగు గంటలు.

ఉమ్మడి సావిడి ఆవరణలో ప్రహరీకి ఆన్చివేసిన రాతిపలక మీద కూర్చుని హుక్కా పీల్చుతున్నాడు పెద్ద అప్పలరాజు, ఉమ్మడి సావిడి ఆలమండలో వున్న నలభై కుటుంబాల క్షత్రియులది. దాన్ని పెదసావిడి అంటారు.

పెదసావిడి ముందు నుంచి ఆ ఊరికి ముఖ్యమైన రహదారి వుంది. సావిడికీ అటూ ఇటూ, వెనుక వరసలోనూ రాజుల లోగిళ్ళన్నీ వున్నాయి. అయిదు వేల జనాభా వున్న ఆ ఊరిలో రాజుల ఇళ్ళ తరువాత వెలమల ఇళ్లు, అవి దాటిన తరువాత నాలుగయిదు బ్రాహ్మణ కుటుంబాలు. రెండో వేపున తెలగాలు, సాలీలు, కమ్మరం పనిచేసే కంసాళ్ళు, బంగారం పనిచేసే షరాబులూ, కొద్ది నాగాసపు కుటుంబాలు, అవి దాటిన తరువాత చాకలి, మంగలి పేటలూ, కాస్త దూరంగా మాలపేట, కాస్త ఇవతల కుమ్మరిపేట..

పెద అప్పలరాజుకి అరవైనాలుగు సంవత్సరాలు. పల్చటి, తెల్లటి గ్లాస్కో జుబ్బా, నీరుకావి లుంగీ వేసుకున్నాడు. పాంకోళ్లు తొడుక్కున్నాడు. వెడల్పయిన నుదిటి మీద అగరు బొట్టు పెట్టుకున్నాడు. చెవులకు ఎర్రపొళ్ళ తమ్మెట్లు వున్నాయి. వారి కుటుంబంలో నీరుకావి పంచె కట్టిన లగాయితూ భార్యను తాకరు. కుటుంబ సంబంధమైన లావాదేవీల్లో పాలుపంచుకోరు. అదోరకమైన వానప్రస్థం.

గాలి వీచి హుక్కా చిలుంలోని చింతనిప్పులు చిటపటమన్నాయి. దోరస్ తమ్మాకు చిక్కటి వాసన ఆ ప్రాంతాన్ని సున్నితంగా పలకరిస్తోంది. దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెద అప్పలరాజు హుక్కా పీల్చుతున్నాడు. కొత్తలో కాస్త సున్నితంగా, కమ్మగావుండే ముషీ ఖమీరారకం తమాకు వాడేవాడు. కానీ దాని ఘాటు చాలక 'దోరస్' రకానికి మారేడు. ఏడాది కొకసారి వారణాసి నుంచి రైలు బంగీలో అతను తమాకు తెప్పించుకుంటాడు.............

  • Title :K N Y Patanjali Rajugoru. . . . Vari Veerabobbili
  • Author :K N Y Patanjali
  • Publisher :Pramila Publications
  • ISBN :MANIMN4977
  • Binding :Paerback
  • Published Date :March, 2018
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :outofstock